జూన్‌లో 10 కోట్ల వ్యాక్సిన్లు ఇస్తాం: సీరం

పుణె: వచ్చే నెలలో 10 కోట్ల కొవిషీల్డ్ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసి, సరఫరా చేస్తామని ఆదివారం కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. వ్యాక్సిన్లకు డిమాండ్ పెరిగిపోతున్న నేపథ్యంలో తమ సిబ్బంది 24 గంటలూ ఉత్పత్తిని పెంచడానికి పని చేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రికి రాసిన లేఖలో సీరం స్పష్టం చేసింది. జూన్ నెలలో 10 కోట్ల వ్యాక్సిన్లు తయారు చేస్తామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. మే నెలలో 6.5 కోట్లుగా ఉన్న ఉత్పత్తిని పది కోట్లకు పెంచబోతున్నామని ఆ లేఖలో సీరం ప్రభుత్వం, రెగ్యులేటరీ అఫైర్స్ డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ సింగ్ తెలిపారు.
నిజానికి జూన్‌లో 6.5 కోట్లు, జులైలో 7 కోట్లు, ఆగస్ట్, సెప్టెంబర్లలో పది కోట్ల చొప్పున వ్యాక్సిన్లు తయారు చేస్తామని ఈ నెల మొదట్లో సీరం తెలిపింది. అయితే తాజాగా జూన్‌లోనే కొవిషీల్డ్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 10 కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించడం విశేషం. తమకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకొని వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచుతున్నట్లు లేఖలో ప్రకాశ్ కుమార్ చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

