Mamata Banerjee | బెంగాల్ విభజనను ప్రతిఘటిస్తాం: సీఎం మమతా బెనర్జీ
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్‌ను విభజించే అన్ని ప్రయత్నాలను తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిఘటిస్తుందని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. సోమవారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఈ మేరకు స్పష్టం చేశారు. ‘బెంగాల్‌ను విభజించేందుకు వారిని రానివ్వండి. దాన్ని ఎలా అడ్డుకోవాలో వారికి చూపుతాం’ అని అన్నారు.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ను విభజించే అన్ని ప్రయత్నాలను తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిఘటిస్తుందని సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) తెలిపారు. సోమవారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఈ మేరకు స్పష్టం చేశారు. ‘బెంగాల్‌ను విభజించేందుకు వారిని రానివ్వండి. దాన్ని ఎలా అడ్డుకోవాలో వారికి చూపుతాం’ అని అన్నారు. బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని జిల్లాలను విభజించి కొత్తగా కేంద్ర పాలిత ప్రాంతం ఏర్పాటు చేయాలని జార్ఖండ్‌కు చెందిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే డిమాండ్ చేశారు. బెంగాల్‌లోని ముర్షిదాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే గౌరీ శంకర్ ఘోష్ కూడా ఈ డిమాండ్‌కు మద్దతు ఇచ్చారు. ఈ నేపథ్యంలో బెంగాల్ విభజనను తీవ్రంగా ప్రతిఘటిస్తామని మమతా బెనర్జీ అన్నారు.
కాగా, భారత్-బంగ్లాదేశ్ రివర్ కమిషన్‌కు అనుగుణంగా భారత్-భూటాన్ రివర్ కమిషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను నీతి ఆయోగ్ సమావేశంలో లేవనెత్తినట్లు మమతా బెనర్జీ తెలిపారు. ‘ప్రధాని సమక్షంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఈ సమస్యను రికార్డ్ చేశా. పశ్చిమ బెంగాల్ ఆకారం పడవలా ఉన్నందున రాష్ట్రంలో నీటి ఎద్దడి సమస్య చాలా ఎక్కువగా ఉంది. నీతి ఆయోగ్ సమావేశంలో దీనిని హైలైట్ చేశాను’ అని అన్నారు. అలాగే బంగ్లాదేశ్‌తో తీస్తా నీటిని పంచుకునే విషయంలో బీజేపీ ఏకపక్ష నిర్ణయం తీసుకుంటోందని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఈ ఒప్పందాన్ని ఎప్పటికీ అంగీకరించబోమని స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

