Anti NEET bill | నీట్ వ్యతిరేక బిల్లుకు ఎప్పటికీ క్లియరెన్స్ ఇవ్వను: తమిళనాడు గవర్నర్
Anti NEET Bill | తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం స్టాలిన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్) వ్యతిరేక బిల్లును (Anti NEET bill) ఎప్పటికీ క్లియర్ చేయబోనని స్పష్టం చేశారు.
చెన్నై: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం స్టాలిన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్) వ్యతిరేక బిల్లును (Anti NEET bill) ఎప్పటికీ క్లియర్ చేయబోనని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురు చూస్తున్న ఈ బిల్లుకు క్లియరెన్స్ ఇచ్చే చివరి వ్యక్తిని తానేనని, అందుకే ఎప్పటికీ దానిని క్లియర్ చేయనని తెలిపారు. అలాగే దేశమంతా నీట్ పరీక్ష ఉంటుందని చెప్పారు. నీట్ 2023లో టాప్ స్కోర్ సాధించిన అభ్యర్థులు గవర్నర్ ఆర్ఎన్ రవిని రాజభవన్లో కలిశారు. ఈ సందర్భంగా తమిళనాడులో నీట్‌ను మినహాయించాలని కోరుతూ ప్రభుత్వం తెచ్చిన బిల్లు క్లియరెన్స్ గురించి నీట్ టాపర్ తండ్రి గవర్నర్‌ను అడిగారు.
కాగా, గవర్నర్ ఆర్ఎన్ రవి దీనికి సమాధానమిస్తూ.. ‘నేను మీకు చాలా స్పష్టంగా చెబుతున్నా. నీట్ (బిల్లు)కు ఎప్పటికీ క్లియరెన్స్ ఇవ్వను. ఇది చాలా స్పష్టం. ఏది ఏమైనప్పటికీ అది రాష్ట్రపతికి వద్దకు వెళ్ళింది. ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం కావడంతో క్లియరెన్స్ చేసే సమర్థత రాష్ట్రపతికి మాత్రమే ఉంది’ అని అన్నారు.
మరోవైపు నీట్ లేకుండా విద్యార్థులు సాధించిన విజయాలు భవిష్యత్తుకు సరిపోవని గవర్నర్ ఆర్ఎన్ రవి తెలిపారు. మన పిల్లలను మేథో వికలాంగులుగా భావించడం తనకు ఇష్టం లేదన్నారు. మన పిల్లలు పోటీపడి అత్యుత్తమంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని, దీనిని వారు నిరూపించారని అన్నారు.
అలాగే కోచింగ్ తీసుకున్న వారు మాత్రమే జాతీయ స్థాయి మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్లో ఉత్తీర్ణత సాధిస్తారన్న అపోహ ప్రచారంలో ఉందని గవర్నర్ ఆర్ఎన్ రవి తెలిపారు. అంతేగాక నీట్ ప్రిపరేషన్‌కు సీబీఎస్ఈ సిలబస్ ఎంతో ప్రామాణికమని అన్నారు. విద్యార్థులు ఆ స్థాయికి రాణించాలని సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు పనిచేసేది 3 నెలలే.. మిగతా 9 నెలలు పేకాట, మద్యం తాగుతూ గడిపేస్తారు.. బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
Kazipet Land Scam | నాడు గూడు కల్పించింది కాంగ్రెస్సే.. నేడు కూల్చుతున్నది కూడా కాంగ్రెస్సే.. కాజీపేట భూమి అసలు కథ ఇదే
Dharma Deeksha | సర్కార్ ధోకాపై ఉద్యోగుల ఆగ్రహం.. ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా సామూహిక సెలవులు!
Land Scam | కాంగ్రెస్ నేత భూమేత.. కొత్లాపూర్‌లో దళిత రైతును బెదిరించి గుంజుకున్న జాతీయ నేత
Mahesh Kumar Goud | చామల ఎవడు.. కమిటీలు ప్రకటించే అధికారం ఆయనకెక్కడిది?.. మహేశ్‌కుమార్ గౌడ్ ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

