బెంగళూరు : నల్లగా ఉన్నాడని భర్తను భార్య అవమానించడం క్రూరత్వం కిందకే వస్తుందని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. భార్య నుంచి విడాకులకు దరఖాస్తు చేసుకొనేందుకు ఇది ఒక బలమైన కారణం అవుతుందని పేర్కొంటూ.. 40 ఏండ్ల వయసు పైనున్న దంపతులకు తాజాగా విడాకులు మంజూరు చేసింది. భర్త నల్లగా ఉన్నాడని , అతనితో కలిసివుండటానికి భార్య నిరాకరించినట్టు నిర్ధారణ అయింది.