కోవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్‌వో అమనుతి ఈ వారంలోనే!

న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ సంస్థకు చెందిన కోవాగ్జిన్ కోవిడ్ టీకాకు ఈ వారంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతులు దక్కే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ కోవిడ్ టీకాలు రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇండియాలో ఈ టీకాను అత్యవసర అమనుతి కింద వినియోగిస్తున్నారు. దీంతో పాటు కోవీషీల్డ్‌ను కూడా ఇండియాలో వాడుతున్నారు. అయితే కోవీషీల్డ్‌కు డబ్ల్యూహెచ్‌వో అనుమతి ఉంది. కోవాగ్జిన్ తీసుకున్న అంతర్జాతీయ ప్రయాణికులకు కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. డబ్ల్యూహెచ్‌వో అనుమతి దక్కితే, అప్పుడు ఆ ట్రావెలర్స్‌కు పెద్ద ఊరట కలుగుతుంది. మొత్తం నాలుగు దశల పర్యవేక్షణ తర్వాత టీకాలకు డబ్ల్యూహెచ్‌వో అనుమతి దక్కుతుంది. ఉత్పత్తిదారుడి ఇంట్రెస్ట్, డబ్ల్యూహెచ్‌వో శాస్త్రవేత్తలతో పాటు ఉత్పత్తిదారుల మధ్య సమావేశం, ఆ తర్వాత కంపెనీ సమర్పించే పత్రాలను డబ్ల్యూహెచ్‌వో సమీక్షించడం, ఇక చివరగా తుది ఆమోదం ఇవ్వడం జరుగుతుంది.
అత్యవసర వినియోగం కింద తమ టీకాకు అనుమతి ఇవ్వాలంటూ డబ్ల్యూహెచ్‌వోకు మే నెలలో భారత్ బయోటెక్ దరఖాస్తు పెట్టుకున్నది. జూన్ 23వ తేదీన భారత్ బయోటెక్, డబ్ల్యూహెచ్‌వో మధ్య భేటీ జరిగింది. మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ తర్వాత కోవాగ్జిన్ టీకా విశ్లేషణ ఉంటుందని భారత్ బయోటెక్ కంపెనీ శాస్త్రవేత్త అప్పట్లో తెలిపారు. వ్యాక్సిన్ ద్వారా కలిగే రోగనిరోధక శక్తి, టీకా సురక్షితంగా ఉందా లేదా, ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందని డబ్ల్యూహెచ్‌వో అధ్యయనం చేస్తుంది. టీకా సామర్థ్యం 77.8 శాతంగా ఉన్నట్లు మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ ద్వారా తేలింది. జూలై 9వ తేదీ లోపు ఎమర్జెన్సీ లిస్టింగ్‌కు చెందిన కోవాగ్జిన్ డేటాను డబ్ల్యూహెచ్‌వోకు సమర్పించారు.
మరోవైపు కోవాగ్జిన్‌కు అత్యవసర అనుమతులు ఇచ్చేందుకు అమెరికా నిరాకరించింది. ఆ టీకాకు చెందిన సమాచారం అసంపూర్ణంగా ఉన్నట్లు ఎఫ్‌డీఏ గతంలో తెలిపింది. గుయానా, ఇరాన్, మారిషెస్, మెక్సికో, నేపాల్, పరాగ్వే, పిలిప్పీన్స్, జింబాబ్వే, ఇస్టోనియా దేశాలు మాత్రం కోవాగ్జిన్‌కు ఓకే చెప్పేశాయి. డబ్ల్యూహెచ్‌వో నుంచి అనుమతి దక్కితే, అప్పుడు మిగితా దేశాలు కూడా కోవాగ్జిన్ టీకాలను దిగుమతి చేసుకునే వీలు ఉంటుంది. విదేశాల్లోనూ ఆ టీకా ఉత్పత్తి చేసేందుకు మార్గం ఈజీ అవుతుంది. డబ్ల్యూహెచ్‌వో చేపట్టే కోవాక్స్ ప్రాజెక్టులో కూడా ఈ టీకాను వాడే ఛాన్సు ఉంటుంది. ఆగస్టులో కోవాగ్జిన్‌కు గుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ సర్టిఫికేట్‌ను హంగేరి ఇచ్చిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

