Measles | ఒకరి నుంచి 18 మందికి మీజిల్స్ సోకే ప్రమాదం..! హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ..!
Measles | ఇటీవల ప్రపంచవ్యాప్తంగా మీజిల్స్ (measles) వేగంగా వ్యాపిస్తున్నది. చైనా, మంగోలియా, దక్షిణాఫ్రికాతో పాటు పలు దేశాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. భారత్‌లోనూ మహారాష్ట్ర, కేరళతో సహా పలు రాష్ట్రాల్లో కేసులు వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితి దిగజారుతోందని, మిలియన్లలో పిల్లలు ప్రమాదం అంచున ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) ఆందోళన
WHO Waring on measles | ఇటీవల ప్రపంచవ్యాప్తంగా మీజిల్స్ (measles) వేగంగా వ్యాపిస్తున్నది. చైనా, మంగోలియా, దక్షిణాఫ్రికాతో పాటు పలు దేశాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. భారత్‌లోనూ మహారాష్ట్ర, కేరళతో సహా పలు రాష్ట్రాల్లో కేసులు వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితి దిగజారుతోందని, మిలియన్లలో పిల్లలు ప్రమాదం అంచున ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) ఆందోళన వ్యక్తం చేసింది. ఒక్క మిజీల్స్ కేసు.. 12 నుంచి 18 ఇన్ఫెక్షన్స్కు దారితీస్తుందని హెచ్చరించింది. వైరస్ ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉందని తెలిపింది. గతేడాది అంటే 2021లో ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది మిలియన్ల మీజిల్స్ కేసులు నమోదవగా.. 1.28లక్షల మరణాలు సంభవించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. దాదాపు 22 దేశాల్లో ఈ వైరస్ విధ్వంసం సృష్టించిందని నిపుణులు పేర్కొంటున్నారు.
ప్రస్తుతం మీజిల్స్ వ్యాప్తి కారణం వ్యాక్సినేషన్ సరిగా జరుగకపోవడమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. 2021లో రికార్డు స్థాయిలో దాదాపు 40 మంది పిల్లలు మీజిల్స్ టీకాను మిసయ్యారు. 25 మిలియన్ల మంది పిల్లలకు తొలిడోస్ తప్పిపోయారు. 14.7 మంది మిలియన్ల పిల్లలు రెండో డోస్ మిస్సయ్యారు. కరోనాకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు టీకాల పంపిణీ చేపట్టిన విషయం విధితమే. దీంతో సాధారణ రోగనిరోధక టీకాల పంపిణీ కార్యక్రమాలు దెబ్బతిన్నాయి. దీంతో మిలియన్ల సంఖ్యలో ప్రాణాంతక వ్యాధుల బారి నుంచి రక్షించే టీకాలను కోల్పోయారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ అధనామ్ ఘెబ్రేయేసన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్‌ను తిరిగి గాడిలో పెట్టడం చాలా క్లిష్టమైందన్నారు.
ప్రమాదంలో 40 మిలియన్ల మంది..
మీజిల్స్ (తట్టు) అంటువ్యాధి అయినప్పటికీ.. దీన్ని టీకా ద్వారా పూర్తిగా నివారించవచ్చు. మీజిల్స్ బారి నుంచి కాపాడేందుకు, రోగనిరోధకశక్తిని పెంచేందుకు, వైరస్‌ను నిర్మూలించేందుకు రెండు డోసుల మీజిల్స్ వ్యాక్సిన్ ఇవ్వడం తప్పనిసరి. సమాజ వ్యాప్తిని నివారించేందుకు 95శాతం వ్యాక్సిన్లు వేయడం అవసరం. ప్రపంచవ్యాప్తంగా 81 శాతం మంది పిల్లలు మాత్రమే మొదటి మీజిల్స్ వ్యాక్సిన్‌ను, 71శాతం మంది రెండో మోతాదును పొందారు. ఇంతకు ముందు 2008లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత తక్కువగా టీకాల పంపిణీ జరిగిందని, అయితే దేశాన్ని బట్టి టీకా కవరేజీ మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక పేర్కొంది. 2021లో రికార్డు స్థాయిలో దాదాపు 40 మిలియన్ల మంది పిల్లలు మీజిల్స్ వ్యాక్సిన్ మోతాదును కోల్పోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. 18 దేశాల్లో కొవిడ్-19 టీకాల పంపిణీలో జాప్యం కారణంగా దాదాపు 61 మిలియన్ల మీజిల్స్ వ్యాక్సిన్ డోసుల పంపణీ వాయిదాపడ్డాయి. ఈ జాప్యమే మీజిల్స్ వ్యాప్తి చెందే ప్రమాదాన్ని పెంచుతాయి. ప్రస్తుతం 2022లో మీజిల్స్ వేగంగా వ్యాప్తి చెందడం అంటే ప్రతీ ప్రాంతానికి ముప్పేనని.. ఈ తరుణంలో ప్రజారోగ్య అధికారులు టీకాల పంపిణీని వేగవంతం చేయడానికి, నిఘాను బలోపేతం చేయడానికి సమయం ఆసన్నమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది.
మహారాష్ట్రలో 12 మంది మృతి..
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ముంబై మీజిల్స్ వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. మహానగరంలో ఈ ప్రమాదకరమైన వ్యాధి బారిన పడి ఇప్పటివరకు 12 మంది మరణించారు. నగరంలో మీజిల్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, బీఎంసీ కూడా తమ పిల్లలకు టీకాలు వేయించాలని సాధారణ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ముంబైలో మీజిల్స్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని, పౌరులందరూ తమ పిల్లలకు 9 నెలల నుంచి 5 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు మీజిల్స్ వ్యాక్సిన్‌తో టీకాలు వేయించాలని కోరింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
Endometriosis | ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి..
Bharateeyudu 3 | ‘భారతీయుడు 3’ వర్సెస్ ‘స్పిరిట్’, ‘వారణాసి’.. ఈ బాక్సాఫీస్ పోరులో శంకర్ నిర్ణయం ఏంటి?
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

