Champai Soren | సీఎం పీఠంపై జార్ఖండ్ టైగర్..! ఎవరీ చంపై సోరెన్..?
Champai Soren | జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ నియామకం కానున్నారు. ప్రసుత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా నేపథ్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చా చంపై సోరెన్‌ను సీఎంగా ఎన్నుకున్నారు. చంపై సోరెన్.. హేమంత్ సోరెన్‌కు దగ్గరి బంధువని సమాచారం.
Champai Soren | జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ నియామకం కానున్నారు. ప్రసుత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా నేపథ్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చా చంపై సోరెన్‌ను సీఎంగా ఎన్నుకున్నారు. చంపై సోరెన్.. హేమంత్ సోరెన్‌కు దగ్గరి బంధువని సమాచారం. ప్రస్తుతం ఆయన కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జేఎంఎంతో పాటు కాంగ్రెస్ సైతం మిత్రపక్షంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ బాధ్యతలు స్వీకరిస్తారని ప్రచారం జరిగింది. ఎవరూ ఊహించని విధంగా చంపై సోరెన్ పేరు తెరపైకి వచ్చింది.
జార్ఖండ్ టైగర్‌గా పేరు..
చంపై సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ నుంచి సెరైకెలా అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కేబినెట్ మంత్రిగా హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో రవాణా, షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ బాధ్యతలను బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చంపై 1974లో జంషెడ్‌పూర్‌లోని రామకృష్ణ మిషన్ హైస్కూల్లో 10వ తరగతి వరకు చదివారు. బీహార్ నుంచి ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రం కోసం డిమాండ్ వచ్చిన సమయంలో చంపై పేరు వార్తల్లో నిలిచింది. శిబు సోరెన్‌తో పాటు చంపై సైతం ప్రత్యేక జార్ఖండ్ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ప్రజలు ఆయనను ‘జార్ఖండ్ టైగర్’గా పిలుస్తూ వస్తున్నారు.
తొలిసారిగా 2005లో అసెంబ్లీకి..
చంపై తొలిసారిగా 2005లో జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009లోనూ మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సెప్టెంబర్ 2010 నుంచి జనవరి 2013 వరకు సైన్స్ అండ్ టెక్నాలజీ, లేబర్ హౌసింగ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. జూలై 2013 నుంచి డిసెంబర్ 2014 పౌర సరఫరాలు, రవాణా శాఖ మంత్రిగా పని చేశారు. 2014లో మూడోసారి జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2019లో నాలుగోసారి ఎమ్మెల్యే ఎన్నికయ్యారు. హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో రవాణా, సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు.
భూకుంభకోణంలో ఇరుక్కోవడంతో..
హేమంత్ సోరెన్ భూ కుంభకోణంలో ఇరుక్కున్నారు. ఈ కుంభకోణంపై ఈడీ దర్యాప్తు చేస్తున్నది. పలుసార్లు ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేయగా.. విచారణకు గైర్హాజరయ్యారు. ఇంతకు ముందు ఒకసారి విచారించింది. మళ్లీ బుధవారం సైతం ఈడీ అధికారులు ఆయన నివాసానికి చేరుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలో ఉన్నారు. అరెస్టు చేసే అవకాశం ఉండడంతో జార్ఖండ్ సీఎం పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. ఈ క్రమంలో జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM), కాంగ్రెస్ కూటమి శాసనసభా పక్ష నేతగా చంపై సోరెన్‌ను ఎన్నుకున్నాయి. తొలుత కల్పనా సోరెన్‌ను సీఎం చేస్తారని చెప్పినా.. చివరకు చంపై సోరెన్‌కు అవకాశం దక్కింది. హేమంత్ సోరెన్‌కు అత్యంత దగ్గరి వ్యక్తుల్లో చంపై సోరెన్ ఒకరు. శిబు సోరెన్‌తో పాటు హేమంత్ సోరెన్‌తో చాలాకాలంగా పని చేస్తూ వస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

