Ajinkya Shinde | సీజేపీ నిరసనల బాధ్యతలు అజింక్య షిండేకు.. ఆయన ఎవరంటే?
Ajinkya Shinde | మహారాష్ట్రలోని తీరప్రాంత పట్టణమైన అలీబాగ్‌కు చెందిన అజింక్య షిండే చాలా ఏళ్లుగా అభిజీత్ దీప్కేకు సన్నిహితుడు. 2016లో గోవాలో దీప్కేను మొదటిసారి ఆయన కలిసినట్లు సమాచారం. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) జాతీయ సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా అజింక్య షిండే ఉన్నారు.
న్యూఢిల్లీ: సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, ఆయన బృందాన్ని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్లాన్ ‘బి’ని సీజేపీ అమలు చేయనున్నది. (Ajinkya Shinde) ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ను ఆ పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్‌తో శనివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద తలపెట్టిన నిరసనల బాధ్యతను కీలక సభ్యుడైన అజింక్య షిండేకు అప్పగించింది. దీంతో అభిజీత్ దిప్కే గైర్హాజరీలో జంతర్ మంతర్ వద్ద జరిగే ఆందోళనకు నాయకత్వం వహించనున్న ఆయన ఎవరు అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, మహారాష్ట్రలోని తీరప్రాంత పట్టణమైన అలీబాగ్‌కు చెందిన అజింక్య షిండే చాలా ఏళ్లుగా అభిజీత్ దీప్కేకు సన్నిహితుడు. 2016లో గోవాలో దీప్కేను మొదటిసారి ఆయన కలిసినట్లు సమాచారం. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) జాతీయ సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా అజింక్య షిండే ఉన్నారు. సీజేపీ ముంబై విభాగంలో కీలక వ్యక్తి. ఈ నెల ప్రారంభంలో ముంబైలో జరిగిన ‘ప్రెజర్ గ్రూప్’ ఆందోళన కార్యక్రమానికి ఆయన నిర్వాహకుడిగా వ్యవహరించారు.
మరోవైపు అజింక్య షిండే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మహారాష్ట్ర బృందానికి సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా పనిచేశారు. ఆ పార్టీ కోసం పూర్తిస్థాయిలో పనిచేయడానికి తన కార్పొరేట్ ఉద్యోగాన్ని ఆయన వదిలేశారు. ఆప్‌లో చేరిన తర్వాత గోవా ఎన్నికల కోసం ఒక సంవత్సరం పూర్తిగా తన సమయాన్ని ఆయన కేటాయించారు. గోవా అసెంబ్లీ ఎన్నికలలో ఖాతా తెరువడంలో ఆప్ విఫలమైనప్పటికీ ఆ పార్టీ పట్ల అజింక్య నిబద్ధతతో ఉన్నారు. ఆప్ మహారాష్ట్ర బృందంతో కలిసి ఆయన పనిచేశారు. మహారాష్ట్రలోని ప్రతి జిల్లాలో అజింక్య షిండే పర్యటించినట్లు తెలుస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ajinkya Shinde | సీజేపీ నిరసనల బాధ్యతలు అజింక్య షిండేకు.. ఆయన ఎవరంటే?
Shashi Tharoor | ఎమర్జెన్సీ కాదు.. ఇది ఎమర్ జెన్ జీ.. ఢిల్లీలో పోలీసుల దిగ్బంధనంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

