ఆయనో సాధారణ ప్లంబర్. ప్లంబర్ పని నిమిత్తం ఓ ఇంటికి వెళ్లాడు. యజమాని తలుపు తీశాడు. ఆ ప్లంబర్ పనిచేస్తూ.. పని చేస్తూ.. పాటుల పాడుతున్నాడు. ఈ పాటలు ఆ ఇంటి యజమాని చెవిలో పడ్డాయి. అంతే.. ఇంకేమీ కాలేదు. ఆ ప్లంబర్ జీవితం హఠాత్తుగా మారిపోయింది. ప్లంబర్ దశే తిరిగిపోయింది. ఆ ఇంటి యజమాని ఓ మ్యూజిక్ డైరెక్టర్. ఇంకేముంది.. ఆ ప్లంబర్ జీవితం పైనే హాలివుడ్లో ఓ సినిమా తీయడానికి రెడీ అయ్యారు.
ఇదంతా జరిగింది లిసెస్టర్ అనే పట్టణంలో. ఆ ప్లంబర్ పేరు కేవ్ క్రేన్. వయస్సు 50 సంవత్సరాలు. ఆయన ప్లంబర్ పనిచేస్తుంటాడు. ఓ రోజు ఓ మ్యూజిక్ డైరెక్టర్ ఇంట్లో పని వచ్చింది. దీతో ఆయన అక్కడ పనిచేస్తున్నాడు. పని చేస్తూ పని చేస్తూ ఆయన ఓ పాట పాడాడు. ఆ పాట మొత్తాన్ని ఆ మ్యూజిక్ డైరెక్టర్ విన్నాడు. దీంతో ఈ ప్లంబర్ బాగా నైపుణ్యం గలవాడని నిర్ధారించుకున్నాడు. దీంతో ఆయనను పిలిచి, కాసేపు ముచ్చటించాడు. ఈ సమయంలో అనేకానేక ముచ్చట్లు బయటకు వచ్చాయి. దీంతో ఆ మ్యూజిక్ డైరెక్టర్ ప్లంబర్పై ఓ ఆల్బమ్ చేశాడు. దీన్ని ఓ పెద్ద ఫిల్మ్ డైరెక్టర్ చూశాడు. అంతే.. ఇంకేముంది ఆయన జీవితాన్ని సినిమాగా తీస్తానని ప్రకటించాడు. కేవలం ప్లంబర్లా ఉండే ఆ వ్యక్తి.. ఇప్పుడు హీరో అయి కూర్చున్నాడు.