Haryana | హర్యానాలోని నూహ్‌లో ‘విశ్వహిందు పరిషత్’ సోమవారం శోభా యాత్రకు పిలుపునివ్వగా, రాష్ట్రంలో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. రాష్ట్ర ప్రభుత్వం నూహ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతా బలగాల్ని పెద్ద ఎత్తున మోహరించింది.
మొబైల్ ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేసింది. గతంలో వీహెచ్‌పీ చేపట్టిన మతపరమైన ఊరేగింపు కారణంగానే నూహ్‌లో హింస పెద్ద ఎత్తున చెలరేగిన సంగతి తెలిసిందే. శోభా యాత్రకు పోలీసుల అనుమతి లేకున్నా, ఎట్టి పరిస్థితుల్లో యాత్రను చేపట్టి తీరుతామని వీహచ్పీ మళ్లీ ప్రకటించటం గమనార్హం. సోమవారం విద్యా సంస్థల్ని, బ్యాంకుల్ని మూసేస్తూ జిల్లా అధికారులు ఆదేశాలు జారీచేశారు.
#WATCH | Haryana | Security arrangements made in view of Vishwa Hindu Parishad's (VHP) call for Yatra today. Visuals from Nuh.
Inspector Kuldeep Singh, Haryana Police says, "Situation is peaceful here. Permission has not been granted to conduct 'Yatra'. Only locals of Nuh are… pic.twitter.com/BP19MHWeVo
— ANI (@ANI) August 28, 2023
#WATCH | Haryana | Heavy police deployment in Nuh in view of Vishwa Hindu Parishad's (VHP) call for 'Yatra'. pic.twitter.com/I7UMpwrlqW
— ANI (@ANI) August 28, 2023