న్యూఢిల్లీ, జనవరి 31: మీరు యాపిల్ ఐఫోన్ 6, మొదటి జనరేషన్ ఐఫోన్ ఎస్ఈ లేదా పాత ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా? అయితే ఫిబ్రవరి 1 నుంచి మీ పాత స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ పని చేయదని హెచ్టీ టెక్ నివేదిక వెల్లడించింది. ఇకపై ఆండ్రాయిడ్ ఫోన్లలో వెర్షన్ 4.0.3 లేదా కొత్త వెర్షన్ ఉంటేనే వాట్సాప్ పనిచేస్తుంది. అలాగే ఐఓఎస్ వెర్షన్ 12 ఆపై స్థాయివే వాట్సాప్ సేవలకు అనుకూలం. దీని కన్నా పాత వెర్షన్ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు.
వాట్సాప్ పనిచేయని ఫోన్లు ఇవే..