తిరువనంతపురం: కేరళ క్యాబినెట్లోకి మాజీ మంత్రి సాజీ చెరియన్ను తిరిగి తీసుకోవటంపై ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ స్పందించారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్న సాజీ చెరియన్‌కు తిరిగి మంత్రి పదవి ఇవ్వడం కరెక్టు కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ విషయంలో కేరళ సీఎం పినరయి విజయన్‌కు తాను ఇవ్వాల్సిన సలహా ఇచ్చానని, ఆపై సాజీ చెరియన్ను క్యాబినెట్లోకి తీసుకోవాలన్న ఆయన ప్రతిపాదనకు ఆమోదం తెలిపానని గవర్నర్ ఆరిఫ్ ఖాన్ చెప్పారు. రేపు మంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని అన్నారు.