వ్యాక్సిన్ కంపెనీలు కోరుతున్న ఆ రక్షణ ఏంటి? ఇస్తే ఏం జరుగుతుంది?

న్యూఢిల్లీ: కరోనా రెండో దశ దేశాన్ని తీవ్రంగా వణికించింది. లక్షల కొద్దీ కేసులు.. వేల కొద్దీ మరణాలు.. శ్మశాన వాటికల్లో అంత్యక్రియల కోసం క్యూ కట్టిన శవాలు.. తలచుకుంటనే వెన్నులో వణుకుపుడుతుంది. దీంతో కరోనా కట్టడి కోసం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా సిద్ధంగా ఉంది. అందులో భాగంగానే కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ మధ్యే ఓ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాలతోపాటు డబ్ల్యూహెచ్‌వో అనుమతి పొందిన వ్యాక్సిన్లకు ఇండియాలో బ్రిడ్జింగ్ ట్రయల్స్ అవసరం లేదని స్పష్టం చేసింది. ఇది ఫైజర్, మోడెర్నాలాంటి కంపెనీల వ్యాక్సిన్ల రాకను సుగమం చేసింది.
తాజాగా ఈ కంపెనీలు ప్రధానంగా చేస్తున్న మరో డిమాండ్‌కూ ప్రభుత్వం సరే అనేలా ఉందన్న వార్తలు వస్తున్నాయి. తమకు చట్టపరమైన రక్షణలు కల్పించాలన్నదే ఆ డిమాండ్. ఇతర దేశాలు అది కల్పించినప్పుడు తమకు మాత్రం అభ్యంతరం ఏముంటుందని బుధవారం ప్రభుత్వ వర్గాలు అన్నట్లు వార్తలు వచ్చాయి. ఇది చూసి తమకు కూడా అవే రక్షణలు కల్పించాలని కొవిషీల్డ్ తయారు చేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా గురువారం డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో అసలు కంపెనీలు కోరుతున్న ఈ చట్టపరమైన రక్షణలు అంటే ఏంటో ఒకసారి చూద్దాం.
ఈ ఇన్డెమ్నిటీ క్లాజ్ ఏంటి?
వ్యాక్సిన్ కంపెనీలు తమకు ఇన్డెమ్నిటీ కల్పించాలని అడుగుతున్నాయి. లీగల్ పరిభాషలో చెప్పాలంటే ఒక పార్టీ చర్యల వల్ల దానికి కలిగే నష్టాన్ని అవతలి పార్టీ భరించడం. సాధారణంగా ఇన్సూరెన్స్ కాంట్రాక్టులలో దీనిని ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఇప్పుడు భారత ప్రభుత్వం వ్యాక్సిన్ కంపెనీలకు ఈ చట్టపరమైన రక్షణ కల్పించడానికి సిద్ధపడితే.. ఎవరైనా సదరు వ్యాక్సిన్ వల్ల తమకు కలిగిన దుష్ప్రభావాలకు నష్టపరిహారాన్ని కోరినప్పుడు ఆ కంపెనీకి బదులు ప్రభుత్వం దానిని చెల్లించాల్సి ఉంటుంది.
వేరే దేశాలు ఇస్తున్నాయా?
ఇప్పటికే అమెరికాలాంటి దేశాలు ఫైజర్, మోడెర్నా కంపెనీలకు ఈ చట్టపరమైన రక్షణ కల్పిస్తున్నాయి. గతేడాది డిసెంబర్లో ఓ అమెరికా ఫెడరల్ కోర్టు ఈ రెండు కంపెనీలకు ఈ రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఈ రక్షణ కల్పించడానికి ఇతర దేశాలు ఎలాంటి విధానాలు అనుసరిస్తున్నాయో ఇండియా కూడా అలాగే ముందడుగు వేసే అవకావాలు కనిపిస్తున్నాయి. ఫైజర్, మోడెర్నాలాంటి కంపెనీలు ఇండియాకు రావడానికి ఈ క్లాజే ప్రధాన అడ్డంకిగా ఉంది. ఇప్పుడు భారత ప్రభుత్వం దీనికి సరేనంటే రానున్న నెలల్లో 5 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపడానికి ఫైజర్ సిద్ధంగా ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

