Yoga Day: ఏమిటీ క్రియాయోగ? అసలైన శాంతి, ఆనందం లభిస్తాయి?
Yoga Day: ‘యోగా’ లేక ‘యోగ్’ అంటే ‘ఈశ్వరుడితో కలయిక ‘అని భావార్థం. అన్ని ఆత్మలూ అంతరికంగా వాంఛించే అసలైన కలయిక. ఈ భూమిపై జీవించే మానవుల్లో చాలామంది ‘యోగ’ అన్న మాట వినే ఉంటారు. కానీ వారిలో అత్యధికులు యోగ అంటే శారీరక వ్యాయామాలైన యోగాసనాలు (హఠ యోగం) గా భావిస్తారు. అయినప్పటికీ యోగంలో మనం అర్థం చేసుకొని ఆచరించాల్సింది ఎంతో ఉంది.
హైదరాబాద్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని(Yoga Day) జూన్ 21వ తేదీన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆ యోగోత్సవాన్ని వేడుకగా జరుపుకోవడమనేది ప్రపంచ క్యాలెండర్ లో ఒక భాగం. దీని అసలైన ప్రాముఖ్యత మన ఆత్మ లోపల ఉంది. ‘యోగా’ లేక ‘యోగ్’ అంటే ‘ఈశ్వరుడితో కలయిక ‘అని భావార్థం. అన్ని ఆత్మలూ అంతరికంగా వాంఛించే అసలైన కలయిక. ఈ భూమిపై జీవించే మానవుల్లో చాలామంది ‘యోగ’ అన్న మాట వినే ఉంటారు. కానీ వారిలో అత్యధికులు యోగ అంటే శారీరక వ్యాయామాలైన యోగాసనాలు (హఠ యోగం) గా భావిస్తారు. అయినప్పటికీ యోగంలో మనం అర్థం చేసుకొని ఆచరించాల్సింది ఎంతో ఉంది.
ప్రఖ్యాత ఆధ్యాత్మిక గ్రంథం “ఒక యోగి ఆత్మకథ” రచయిత అయిన పరమహంస యోగానంద సత్యాన్వేషకులకు యోగం అంటే అసలైన అర్థాన్ని తెలియజెప్పడానికి పాశ్చాత్య ప్రపంచానికి ప్రయాణించారు. జీవితానికి అసలైన అర్థాన్ని తెలుసుకోగోరే అన్వేషకులు అనుసరించవలసిన ‘కార్యాచరణ ప్రణాళిక’లో ధ్యానం విడదీయరాని భాగమని ఉద్ఘాటించిన ఆయన బోధన కాలానుగుణమైనది, కాలాతీతమైనది. జీవితపు అత్యున్నత లక్ష్యమైన ఆత్మసాక్షాత్కారం లేదా దైవంతో ఏకత్వం సాధించడం అనేది ఆధ్యాత్మిక కృషి వల్లనే సాధ్యమవుతుందని యోగానంద ప్రతిపాదించారు. ఇక ఆయన గురువైన శ్రీయుక్తేశ్వర్ గిరి చెప్పిన మాటలు మనం గుర్తు చేసుకోవాలి. “నువ్వు కనక ఇప్పుడు ఆధ్యాత్మిక కృషి చేస్తున్నట్లయితే ఇకముందు ప్రతీదీ మెరుగవుతుంది.”
యోగానంద “ఒక యోగి ఆత్మకథ“ గ్రంథంలో ప్రస్తావించిన అత్యున్నత సత్యాలను సాధించే దిశగా చేసే తన ప్రయత్నాలు ఫలించాలంటే ప్రతి భక్తుడూ అంచెలంచెలుగా సాధన చేయగలిగిన శాస్త్రీయమైన ఆధ్యాత్మిక ప్రక్రియ ఒకటి తప్పక అవసరమవుతుంది.
క్రియాయోగ యోగం యొక్క అత్యున్నత స్వరూపం. దైవ సంసర్గం సాధించడానికి మానవులకు తెలిసిన సర్వశ్రేష్ఠ మార్గం. క్రియాయోగంలో ఉన్న నిర్దిష్టమైన శాస్త్రీయ ప్రక్రియలు సాధకుడికి తన భౌతిక, మానసిక ఆరోగ్యాలను మెరుగుపరుచుకోవడానికే కాక ఆ ‘యోగి’ క్రమేపీ అసలైన శాంతి, ఆనందం — మనలోపల దైవసాన్నిధ్యపు ఉనికికి సూచనలు — కనుగొనగలిగేలా చేస్తాయి.
క్రియాయోగ మార్గం ప్రతి ఒక్కరూ అనుసరించదగినదని, అస్తిత్వపు అత్యున్నత తలానికి చేరుకొనే తిరుగులేని మార్గమని యోగానంద తన ప్రాచ్య, పాశ్చాత్య శిష్యులిరువురికీ వివరించారు. కొన్ని ప్రారంభ ప్రక్రియలకు ఆయన వివరణ ఇవ్వడంతో పాటు అత్యున్నత మెట్టయిన క్రియాయోగ ధ్యానమనే ద్వారానికి దారితీసే ‘జీవించడం ఎలా’ అనే తన తత్వబోధ కూడా వివరించారు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా క్రియాయోగాన్ని గురించి రెండుసార్లు గొప్పగా ప్రస్తావించాడు. క్రియాయోగాన్ని దాని లక్షణాలతో తమ జీవన విధానంగా స్వీకరించడానికి లక్షలాది మంది ప్రేరణ పొందారు. అయితే క్రియాయోగ వల్ల కలిగే లాభం దానిని శ్రద్ధగా అభ్యసించడంలో ఉందని శ్రీయుక్తేశ్వర్ గిరి గురువు లాహిరీ మహాశయులన్నారు. మన ఉనికికి పైనుండే ఉన్నత స్థాయిలలోకి ప్రవేశించడానికి స్వర్ణ ద్వారం క్రియాయోగ ప్రక్రియను క్రమం తప్పకుండా, సరైన విధంగా అభ్యసించడం వల్లనే వస్తాయి.
యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) యోగానంద 1917 లో స్థాపించిన ఆధ్యాత్మిక సంస్థ. వై.ఎస్.ఎస్. యోగానంద విస్తారమైన రచనలపై గాఢమైన అంతర్దృష్టి ప్రసరింపచేసే విధంగా పుస్తకాలు, ముద్రిత పాఠాలు, ఇతరముల ద్వారా వ్యాప్తి చెందిస్తూ పనిచేస్తున్నన్నది. ఇటీవలి దశాబ్దాలలో క్రియాయోగ మార్గాన్ని అనుసరించే భక్తుల సంఖ్య భారతదేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ అపారంగా పెరిగింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

