కొత్త జాతిపిత.. ఈ దేశానికి చేసిందేంటి?.. మోదీపై బీహార్ సీఎం నితీశ్ ఫైర్
CM Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రదాని మోదీపై మరోసారి విరుచుకుపడ్డారు. న్యూ ఇండియాలో నూతన జాతిపిత ఏం ఉద్ధరించారని ఫైరయ్యారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి
పట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రదాని మోదీపై మరోసారి విరుచుకుపడ్డారు. న్యూ ఇండియాలో నూతన జాతిపిత ఏం ఉద్ధరించారని ఫైరయ్యారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృతా ఫడ్నవీస్ ఓ సమావేశంలో మాట్లాడుతూ.. నూతన భారత దేశానికి కొత్త జాతిపిత ప్రధాని మోదీ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై సీఎం నితీశ్ కుమార్ స్పందించారు.
దేశ స్వాతంత్య్రం కోసం బీజేపీ, ఆరెస్సెస్ వాళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. స్వాతంత్య్రోద్యమంలో ఆర్ఎస్ఎస్ వారి పాత్ర ఏమీ లేదన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ పాత్రను మనం మర్చిపోగలమా? అని ప్రశ్నించారు. ‘కొత్త దేశానికి కొత్త జాతిపిత’ దేశానికి మీరేం చేశారని నిలదీశారు. చెప్పుకోదగినదేమైనా చేశారా అని వ్యాఖ్యానించారా. బీజేపీ పాలనలో కొత్త టెక్నాలజీ అభివృద్ధి అయింది అంతే అని విమర్శించారు. దేశంలో మీడియాకు స్వేచ్ఛ లేదు, ప్రతిపక్షాల వ్యాఖ్యలు ప్రసారమవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
గత నెల 21న మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అమృతా ఫడ్నవీస్.. ఈ దేశానికి ఇద్దరు జాతిపితలు ఉన్నారు. గత కాలపు భారత దేశానికి జాతిపిత మహాత్మా గాంధీ అయితే, నూతన భారత దేశానికి జాతిపిత నరేంద్ర మోదీ అన్న అన్నారు.
#WATCH | They had nothing to do with the fight for Independence. RSS didn't have any contribution towards the fight for Independence…we read about the remark of 'New father of nation'…what has the 'new father' of 'new India' done for nation?: Bihar CM Nitish Kumar
(31.12) pic.twitter.com/5RdJmrasIP— ANI (@ANI) January 1, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

