38 కి.మీ. సైకిల్ తొక్కుతూ అసెంబ్లీకి మంత్రి.. ఎందుకో తెలుసా?

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ కార్మికశాఖ మంత్రి బేచారమ్ మన్నా బుధవారం అసెంబ్లీకి సైకిల్‌పై వచ్చారు. హూగ్లీ జిల్లాలో ఉన్న తన ఇంటి నుంచి ఏకంగా 38 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ ఆయన అసెంబ్లీకి రావడం గమనార్హం. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.100 దాటిన వేళ అందుకు నిరసనగా మంత్రి ఇలా సైకిల్‌పై వచ్చారు. ఈయన సింగూర్ నుంచి టీఎంసీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2000లో టాటా నానో ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టి వార్తల్లో నిలిచిన బేచారమ్.. ఇప్పుడిలా పెరిగిన పెట్రోల్ ధరలను వ్యతిరేకిస్తూ సైకిల్ యాత్ర చేపట్టారు. ఉదయం 8 గంటల సమయంలో ఇంటి నుంచి బయలుదేరిన ఆయన.. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అసెంబ్లీకి చేరుకున్నారు. పెరిగిన పెట్రోల్ ధరలు మోదీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని, కోల్‌కతాలో పెట్రోల్ ధర 100 దాటినందుకు నిరసనగా తాను ఇలా చేశానని ఆయన చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

