Gurugram | బర్త్‌డే నాడే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగి.. చివరగా కంపెనీకి మెయిల్
Gurugram : హరియాణాలోని గుర్గావ్లో ఒక ఐటీ ఉద్యోగి భార్యను హత్య చేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గత బుధవారం జరగగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
Gurugram : హరియాణాలోని గుర్గావ్లో ఒక ఐటీ ఉద్యోగి భార్యను హత్య చేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గత బుధవారం జరగగా, ఆలస్యంగా వెలుగు చూసింది. ఇద్దరి మృతదేహాలు వారి అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో లభించాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి. కేరళకు చెందిన మొహమ్మద్ అస్లాం, ఫర్హానా దంపతులు ఐటీలో ఉద్యోగం చేస్తున్నారు. గతంలో బెంగళూరులో ఉద్యోగం చేసిన వీరు.. మూడు నెలల క్రితమే గుర్గావ్ వచ్చారు.
అక్కడి ఎం3ఎం మెరినా రెసిడెన్షియల్ సొసైటీలోనినే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. గత బుధవారం భార్య ఫర్హానా బర్త్ డే కూడా. అదే రోజు అస్లాం.. తన కంపెనీకి ఒక మెయిల్ చేశాడు. మేం ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోతున్నాం అనేది ఈ మెయిల్ సారాంశం. మెయిల్ గురించి తెలిసిన తర్వాత వారి సహోద్యోగులు అస్లాం, ఫర్హానా అద్దెకు ఉంటున్న అపార్ట్మెంట్ ఓనర్‌కు సమాచారం అందించారు. దీంతో ఆయన వెళ్లేసరికి ఫ్లాట్ తలుపులు తెరిచే ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా భార్యాభర్తలు అస్లాం, ఫర్హానా మృతదేహాలు లభించాయి.
దీంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు. అస్లాం ఉరికి వేలాడుతూ మరణించి ఉన్నాడు. భార్య ఫర్హానా ఫ్లోర్‌పై పడి పోయి ఉంది. ఆమె మెడపై గాయాలున్నాయి. ఫర్హానాను అతడే చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. భార్యను చంపిన అనంతరం అతడు ఉరి వేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలం నుంచి పోలీసులు వారి ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. అయితే, అస్లాం ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఇద్దరికీ వైవాహిక జీవితంలో ఎలాంటి గొడవలు లేరని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, కొంతకాలంగా అస్లాం మాత్రం డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని, ఇందుకు చికిత్స కూడా తీసుకుంటున్నారని బంధువులు తెలిపారు. ల్యాప్‌టాప్‌లు, ఫోన్ల పరిశీలన, ఇతర ఆధారాలు, పోలీసుల విచారణ తర్వాతే ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assembly Elections | 2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
Manjeera Water | యథేచ్ఛగా మంజీర నీటి దోపిడీ.. అక్రమంగా వాడుకుంటున్న చార్మినార్ బ్రూవరీస్, గణేశ్ షుగర్స్ కంపెనీలు
City Park | అమ్మకానికి సిటీ పార్క్.. బోగస్ రియల్ ఎస్టేట్ కంపెనీ తరహాలో హెచ్ఎండీఏ వ్యవహారం
Bigg Boss 10 | హౌస్ చివరి కెప్టెన్‌గా దేబ్జానీ.. వర్షిణి, త్రిగుణ్ మధ్య మరోసారి భారీ హైడ్రామా!
HMDA Land Auction | వేలం..మళ్లీ అట్టర్‌ఫ్లాప్.. కోకాపేట్, మూసాపేట్ భూములకూ కరువైన బిడ్డర్లు!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

