Threat mail | కర్ణాటక సీఎంను, డిప్యూటీ సీఎంను చంపేస్తాం.. సిద్ధూ, డీకేలకు బెదిరింపు మెయిల్స్..!
Threat mail | కర్ణాటక ముఖ్యమంత్రి (Karnatak CM) సిద్ధరామయ్య (Siddaramaiah) ను, ఉప ముఖ్యమంత్రి (Deputy CM) డీకే శివకుమార్ (DK Shivakumar) ను హతమారుస్తామని బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.
Threat mail : కర్ణాటక ముఖ్యమంత్రి (Karnatak CM) సిద్ధరామయ్య (Siddaramaiah) ను, ఉప ముఖ్యమంత్రి (Deputy CM) డీకే శివకుమార్ (DK Shivakumar) ను హతమారుస్తామని బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. సీఎం, డిప్యూటీ సీఎంలను దారుణంగా హత్య చేస్తామని ఓ దుండగుడు ఈ మెయిల్లో బెదిరింపు సందేశం పంపాడు. కర్ణాటక విధానసౌధ పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు.
రాంపురకు చెందిన ప్రభాకర్ అనే వ్యక్తికి తాను కోటి రూపాయలు అప్పుగా ఇచ్చానని, దానిని ఇంకా తిరిగి చెల్లించనందున అతడిని కూడా హత్య చేస్తానని మెయిల్లో ఆగంతకుడు పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. సింధార్ రాజపుత్ అనే వ్యక్తి పేరిట మెయిల్ వచ్చినట్లు గుర్తించామని, తదుపరి విచారణ కొనసాగుతోందని అన్నారు.
త్వరలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. బెదిరింపు మెయిల్ నేపథ్యంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నివాసాల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశామని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

