Delhi Building Collapse | మా ఇల్లే కూలిపోతుందేమోనని పరుగులు పెట్టాం.. ఢిల్లీ ప్రమాద ఘటనపై ప్రత్యక్ష సాక్షి
Delhi Building Collapse | ఓల్డ్ ఢిల్లీలోని చావ్రి బజార్లో ఉన్న మూడంతస్తుల భవనం(Building Collapses) కూలిన ప్రదేశంలో ఆరు అగ్నిమాపక దళాలు, వాటర్ టెండర్స్ , రెస్క్యూ వాహనాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
Delhi Building Collapse | ఓల్డ్ ఢిల్లీలోని చావ్రి బజార్లో ఉన్న మూడంతస్తుల భవనం(Building Collapses) కూలింది. ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, కొందరు గాయపడ్డారు. చావ్రి బజార్ మెట్రో స్టేషన్ సమీపంలో ఆ బిల్డింగ్ శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. కాగా ఆరు అగ్నిమాపక దళాలు, వాటర్ టెండర్స్ , రెస్క్యూ వాహనాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
కాగా ఈ ప్రమాదం గురించి ప్రత్యక్ష సాక్షి మహమ్మద్ నయీమ్ మీడియాతో మట్లాడుతూ.. రాత్రి 9 :00 లేదా 9:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మేము నిద్రపోతున్నప్పుడు ఏదో కూలిపోయినట్టు భారీ శబ్ధం వినిపించింది. వెంటనే మేమంతా నిద్రలేచి మా ఇల్లే కూలిపోతుందేమోనని భయంతో బయటకు పరుగులు పెట్టాం. అయితే బయటకు వచ్చి చూడగా పక్కనే నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయిందని తెలిసిందన్నాడు.
అప్పటికే 3,4 అంతస్తుల స్లాబులు వేసి ఉన్నాయి.. అవన్నీ ఒక్కసారిగా కూలిపోయాయి. గాయపడి కార్మకుల్లో ఒక వ్యక్తి చెప్పిన ప్రకారం ఘటన జరిగిన టైంలో ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులున్నారు. భవన శిథిలాల నుంచి ఒక మృతదేహాన్ని బయటకు తీయడం చూశాం. ఈ బిల్డింగ్ గత 3-4 నెలలుగా నిర్మాణంలో ఉందని చెప్పుకొచ్చాడు.
#WATCH | Delhi: An eye-witness Mohd Nayeem says, “This happened around 9:00 or 9:30. We were asleep when we heard a crashing sound. We all got up and rushed outside. We thought our own house was collapsing. When we checked, we realized it was the house being built next door. Three or four lintels had already been cast, and they all collapsed at once. One of the injured laborers said there were about three or four people there. We saw a body being taken out. This building was under construction for the last 3-4 months…”
— ANI (@ANI) November 5, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Building Collapse | మా ఇల్లే కూలిపోతుందేమోనని పరుగులు పెట్టాం.. ఢిల్లీ ప్రమాద ఘటనపై ప్రత్యక్ష సాక్షి
‘ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు’
Rahul Gandhi | నాతో చర్చకు వస్తే మోదీ దేశ ద్రోహి అని ఐదు నిమిషాల్లో నిరూపిస్తా : రాహుల్‌గాంధీ
Uttar Pradesh: భార్యను కుర్చీకి కట్టేసి.. పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన భర్త
కారేపల్లిలో పశువుల సంత వేలం ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

