Supersolid Light | ఏకంగా కాంతినే ఘనీభవింపజేశారు.. ఇటలీ శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ
ద్రవ పదార్థం (లిక్విడ్) ఘన పదార్థం (సాలిడ్)గా మారడాన్నే ఘనీభవన ప్రక్రియ అంటారని మనందరికీ తెలుసు. కానీ, నమ్మశక్యంకాని రీతిలో ఇటలీ శాస్త్రవేత్తల బృందం ఏకంగా కాంతినే ఘనీభవింపజేయగలిగింది. నానో టెక్నాలజిస్టులు, భౌతిక శాస్త్రవేత్తలతో కూడిన ఈ బృందం తొలిసారి కాంతిని ‘సూపర్సాలిడ్'లా ప్రవర్తించేలా చేయగలిగింది.
- తొలిసారి సూపర్సాలిడ్లా మార్పు
Supersolid Light | న్యూఢిల్లీ : ద్రవ పదార్థం (లిక్విడ్) ఘన పదార్థం (సాలిడ్)గా మారడాన్నే ఘనీభవన ప్రక్రియ అంటారని మనందరికీ తెలుసు. కానీ, నమ్మశక్యంకాని రీతిలో ఇటలీ శాస్త్రవేత్తల బృందం ఏకంగా కాంతినే ఘనీభవింపజేయగలిగింది. నానో టెక్నాలజిస్టులు, భౌతిక శాస్త్రవేత్తలతో కూడిన ఈ బృందం తొలిసారి కాంతిని ‘సూపర్సాలిడ్’లా ప్రవర్తించేలా చేయగలిగింది. తద్వారా ఇప్పటివరకు మనకు తెలిసిన సైన్సును మార్చేసింది. ఈ నూతన ఆవిష్కరణకు సంబంధించిన వివరాలు ‘ఏ సూపర్సాలిడ్ మేడ్ యూజింగ్ ఫోటాన్స్’ పేరిట ఈ నెల 5న ‘నేచర్ జర్నల్’లో ప్రచురితమయ్యాయి. ఏదైనా ద్రవం ఉష్ణోగ్రతను దాని ఘనీభవన స్థానానికి తగ్గించినప్పుడు సాధారణ ఘనీభవనం జరుగుతుంది. ఆ ప్రక్రియలో ఆ ద్రవం అణువులు నెమ్మదించి స్పటికాకార నిర్మాణంగా కలిసిపోతాయి. ఇదే మనకు తెలిసిన భౌతికశాస్త్ర సూత్రం.
కానీ, పదార్థంలోని అణువుల ఉష్ణోగ్రతలు పూర్తిగా ‘సున్నా’ స్థాయికి (మైనస్ 273.15 సెంటీగ్రేడ్) తగ్గినప్పుడు వాటి క్వాంటమ్ యాంత్రిక స్వభావం బయటపడుతుందని, పదార్థపు అసాధారణ దశలు కనిపిస్తాయని వారు వివరించారు. గతంలో అతిశీతల అణువులను ఘనీభవింపజేయడం ద్వారా మాత్రమే సూపర్సాలిడ్స్ను సృష్టించగలిగారు. కాంతి కిరణాల్లో (ఫోటాన్స్లో) సూపర్సాలిడ్ స్థితిని గుర్తించడం ద్వారా దాని రహస్యాలను ఛేదించేందుకు కొత్త ద్వారాన్ని తెరిచారు. సూపర్సాలిడిటీ గురించి తెలుసుకునే దిశగా ఇది కేవలం తొలి అడుగు మాత్రమేనని ఇటలీలోని సీఎన్ఆర్ నానోటెక్, పావియా యూనివర్సిటీకి చెందిన భౌతిక శాస్త్రవేత్తలు ఆంటోనియో జియాన్ఫేట్, డేవిడ్ నీగ్రో తెలిపినట్టు ‘న్యూస్‌వీక్’ పత్రిక పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abdul El-Sayed: అమెరికాలో కొత్త చరిత్ర.. తొలి ముస్లిం సేనేటర్గా అబ్దుల్ ఎల్ సయ్యద్ ఎన్నిక
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని నిలబడిన ‘రణబాలి’.. బాక్సాఫీస్ వద్ద రూ.82 కోట్ల గ్రాస్ కలెక్షన్లు!
Kaaka | ‘కాకా’ బిజినెస్‌లో మెగాస్టార్ రేంజ్.. తెలుగు రాష్ట్రాల హక్కులకు రూ.70 కోట్ల డిమాండ్!
Raaka | ఇంకా సగం పూర్తికాని ‘రాకా’ షూటింగ్.. బన్నీ ఫ్యాన్స్‌కు వెయిటింగ్ తప్పదా?
Kadem Project | కడెం ప్రాజెక్టు నుండి సాగునీటిని నిలిపివేసిన అధికారులు.. రైతుల ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

