Delhi weather : దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శనివారం సాయంత్రం ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమైంది. కాసేపటికే గాలిదుమారం మొదలైంది. అక్కడక్కడా చిరుజల్లులు షురువయ్యాయి. మొత్తానికి ఉక్కపోత వాతావరణం కాస్తా చల్లగా మారిపోయింది. భానుడి భగభగలకు అల్లాడిన ఢిల్లీ వాసులకు ఆహ్లాదాన్ని పంచింది.
వాస్తవానికి ఈ వేసవిలో ఎండలు దంచికొడుతున్నాయి. ఏప్రిల్ మొదట్లోనే దేశంలోని పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. దాంతో జనం అల్లాడిపోయారు. అత్యవసర పనులు ఉంటే తప్ప ఇళ్ల నుంచి అడుగు బయటపెట్టలేదు. ఈ క్రమంలో ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఇండియా గేట్ ప్రాంతంలో వాతావరణం చల్లబడి ఈదరుగాలులు వీస్తున్న దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Delhi: Relief from heat as National Capital witnesses sudden weather change.
(Visuals from India Gate) pic.twitter.com/HyqknIsWvG
— ANI (@ANI) April 13, 2024