Cooling tower demolished | ఉట్రాన్ విద్యుదుత్పత్తి కేంద్రంలో కేవలం 7 సెకన్లలో కూలింగ్ టవర్ కూల్చివేత.. వీడియో
Cooling tower demolished | గుజరాత్ రాష్ట్రం సూరత్ పట్టణంలోని ఉట్రాన్ విద్యుదుత్పత్తి కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న కూలింగ్ టవర్ను కంట్రోల్డ్ బ్లాస్ట్ విధానంలో కూల్చివేశారు. ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో కేవలం ఏడు సెకన్లలో కూలింగ్ టవర్ కుప్పకూలింది.
సూరత్: గుజరాత్ రాష్ట్రం సూరత్ పట్టణంలోని ఉట్రాన్ విద్యుదుత్పత్తి కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న కూలింగ్ టవర్ను కంట్రోల్డ్ బ్లాస్ట్ విధానంలో కూల్చివేశారు. ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో కేవలం ఏడు సెకన్లలో కూలింగ్ టవర్ కుప్పకూలింది. 85 మీటర్ల ఎత్తు, 70 మీటర్ల వెడల్పు ఉన్న ఈ RCC కూలింగ్ టవర్ కూల్చివేతకు మొత్తం 250 కిలోల డైనమైట్ను వినియోగించారు.
టవర్ను కూల్చివేయగానే చుట్టూ 100 మీటర్ల దూరం వరకు దుమ్ము ఎగిసిపడింది. అందుకే కూల్చివేతకు ముందే ఆ టవర్ చుట్టూ 2 నుంచి 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న నివాసితులకు ముందస్తు హెచ్చరికలు జారీచేశారు. కూల్చివేత సమయంలో పరిపాలనాధికారులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడే ఉన్నారు. కాగా, ఉట్రాన్ విద్యుదుత్పత్తి కేంద్రంలో రెండు ప్లాంట్లు ఉన్నాయి.
ఒకటి 375 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్ కాగా, మరొకటేమో 135 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్. ఈ 135 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్ పురాతనమైనది. అందుకే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఆ ప్లాంట్ను కూల్చివేశారు. బ్లాస్టింగ్ కేవలం 7 సెకన్లలోనే పూర్తయినప్పటికీ మొత్తం కూల్చివేత ప్రక్రియకు మాత్రం 30 నుంచి 40 నిమిషాల సమయం పట్టింది.
#WATCH | Gujarat: An old cooling tower of Utran Power House in Surat demolished with a controlled blast. pic.twitter.com/SeFug7Skk5
— ANI (@ANI) March 21, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

