Crime news | బీహార్లో ఇసుక మాఫియా అరాచకం.. అడ్డు చెప్పిన మహిళా ఆఫీసర్పై క్రూరంగా దాడి.. వీడియో
Crime news | బీహార్లో ఇసుక మాఫియా బరితెగించింది. ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్నందుకు ఓ మహిళా ఆఫీసర్పై దాడికి పాల్పడింది. ప్రాణ భయంతో పారిపోతున్న అధికారిణిని వెంబడించి రాళ్లు, మట్టిపెడ్డలతో కొట్టింది. ఆమెను కిందపడేసి నేలపై ఈడ్చింది.
పట్నా: బీహార్లో ఇసుక మాఫియా బరితెగించింది. ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్నందుకు ఓ మహిళా ఆఫీసర్పై దాడికి పాల్పడింది. ప్రాణ భయంతో పారిపోతున్న అధికారిణిని వెంబడించి రాళ్లు, మట్టిపెడ్డలతో కొట్టింది. ఆమెను కిందపడేసి నేలపై ఈడ్చింది. దాడి సమయంలో కొందరు ఆ అధికారణిని అసభ్య పదజాలంతో దూషించారు. పట్నా జిల్లాలోని బిహ్త్ పట్టణంలో ఇవాళ ఉదయం ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిందితులుగా తేలిన వారిని అదుపులోకి తీసుకుంటున్నది. ఇప్పటి వరకు మొత్తం 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 44 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఇంకా ఈ ఘటనలో పాత్ర ఉన్న మిగతా వాళ్లను కూడా అదుపులోకి తీసుకునేందుకు పోలీసుల విచారణ కొనసాగుతున్నది.
కాగా, బిహ్త్ పట్టణంలో గత కొన్ని రోజులు ఇసుక అక్రమ మైనింగ్ జరుగుతున్నది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకుని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన ఇసుక మాఫియా మహిళా అధికారిణిపై దాడికి దిగింది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో వీక్షించవచ్చు..
#WATCH | Bihar: Woman officer from mining department dragged, attacked by people allegedly involved in illegal sand mining in Bihta town in Patna district.
(Note: Abusive language; viral video confirmed by police)
44 people arrested, 3 FIRs filed while raids underway to arrest… pic.twitter.com/EtKW1oedG3
— ANI (@ANI) April 17, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

