అక్రమంగా తరలిస్తున్న హెరాయిన్ పట్టివేత.. దాని విలువ ఎంతో తెలుసా..?
Heroin seized | కస్టమ్స్ అధికారులు ఎంత పకడ్బందీగా వ్యవహరించినా అక్రమార్కుల తీరు మాత్రం మారడంలేదు. బంగారమో, మాదక ద్రవ్యాలో, విదేశీ కరెన్సీనో
న్యూఢిల్లీ: కస్టమ్స్ అధికారులు ఎంత పకడ్బందీగా వ్యవహరించినా అక్రమార్కుల తీరు మాత్రం మారడంలేదు. బంగారమో, మాదక ద్రవ్యాలో, విదేశీ కరెన్సీనో అక్రమంగా తరలిస్తూ నిత్యం ఎక్కడో ఒకచోట స్మగ్లర్లు పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. హెరాయిన్‌ను అక్రమంగా తరలిస్తూ ఓ వ్యక్తి పట్టుబడ్డాడు.
బెల్జియం జాతీయుడైన ఓ ప్రయాణికుడు.. జోహన్నెస్‌బర్గ్ నుంచి ధోహా మీదుగా ఢిల్లీకి వచ్చాడు. ఎయిర్‌పోర్టులో అతని తీరును అనుమానించిన కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా ఏకంగా 9 కిలోల హెరాయిన్ లభించింది. దాని విలువ రూ.69.95 కోట్లు ఉంటుందని తెలిపారు. అధికారుల కళ్లుగప్పడం కోసం నిందితుడు తెలివిగా సూట్‌కేసులోని రహస్య పొరలో హెరాయిన్‌ను సీల్ చేశాడు. అయినా కస్టమ్స్ అధికారులు దాన్ని కనిపెట్టి నిందితుడి ఆటకట్టించారు.
#WATCH | Air Customs at Delhi’s IGI Airport seized over 9 kg of Heroin, valued at Rs 69.95 Cr from a Belize national who arrived from Johannesburg via Doha. The contraband was concealed in a false bottom of a bag being carried by him: Custom officials pic.twitter.com/xNWr3OXfI7
— ANI (@ANI) October 31, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

