Warmest Year | 124 ఏళ్లలో అత్యంత వేడి సంవత్సరంగా 2024..!
Warmest Year | ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ముగిశాయి. అన్ని దేశాల ప్రజలు 2024కు గుడ్‌బై చెప్పి 2025లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా వాతావరణ కేంద్రం 2024 సంవత్సరానికి సంబంధించి ఓ కీలక విషయం చెప్పింది. 1901 నుంచి గడిచిన 124 ఏళ్లలో 2024 అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిందని వెల్లడించింది.
Warmest Year : ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ముగిశాయి. అన్ని దేశాల ప్రజలు 2024కు గుడ్‌బై చెప్పి 2025లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా వాతావరణ కేంద్రం 2024 సంవత్సరానికి సంబంధించి ఓ కీలక విషయం చెప్పింది. 1901 నుంచి గడిచిన 124 ఏళ్లలో 2024 అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిందని వెల్లడించింది. 2024లో నేలపై కనిష్ఠ ఉష్ణోగ్రతల సగటు సాధారణ సగటు కంటే 0.65 డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా ఉందని పేర్కొంది.
1901 నుంచి 2020 వరకు నమోదైన దీర్ఘకాలిక సగటు కంటే ఇది చాలా ఎక్కువని భారత వాతావరణ కేంద్రం డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మొహపాత్ర తెలిపారు. అందుకే 2024 ఏడాది గత 124 ఏళ్లలో అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిందని అన్నారు. దాంతో ఇప్పటివరకు అత్యంత వేడి సంవత్సరంగా నమోదై ఉన్న 2016 రెండో స్థానానికి వెళ్లిపోయిందని చెప్పారు. 2016లో నేలపై సాధారణ కనిష్ఠ సగటు ఉష్ణోగ్రత కంటే 0.54 సెల్సియస్ ఎక్కువగా నమోదైందని అన్నారు.
వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్, క్లైమేట్ సెంట్రల్ అనే రెండు వాతావరణ శాస్త్రవేత్తల బృందాలు ప్రతి ఏడాది ఉష్ణోగ్రత రిపోర్టులు అందిస్తాయి. 2024లో మొత్తం 41 కిపైగా రోజులు ప్రమాదకరమైన వేడి కలిగిన రోజులుగా రికార్డయ్యాయని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

