రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై దలైలామా ఆవేదన… అహింసే మార్గమని వ్యాఖ్య
న్యూఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై టిబెటన్ ఆధ్యాత్మిక నేత దలైలామా ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధాలకు కాలం చెల్లిందని, అహింస ఒక్కటే మార్గమని అన్నారు. తూర్పు ఐరోపా దేశంలో శాంతిని త్వరగా పునరుద్ధరించాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగడంపై 14వ దలైలామా సోమవారం స్పందించారు. మన ప్రపంచం చాలా పరస్పర ఆధారితంగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య హింసాత్మక ఘర్షణ అనివార్యంగా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుందని తెలిపారు. యుద్ధం అనేది పాతదని, అహింస మాత్రమే సమస్యలకు పరిష్కార మార్గమని అన్నారు. అందరినీ సోదర, సోదరీమణులుగా భావించాలని, మానవులంతా ఒక్కటే అన్న భావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అప్పుడే మనం మరింత శాంతియుత ప్రపంచాన్ని నిర్మించగలమని వ్యాఖ్యానించారు.
రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల పరిష్కారానికి దలైలామా కొన్ని సూచనలు చేశారు. సమస్యలు, విభేదాలను చర్చల ద్వారా ఉత్తమంగా పరిష్కరించుకోవచ్చని పునరుద్ఘాటించారు. పరస్పర అవగాహన కలిగి ఉండటం, ఒకరి శ్రేయస్సును మరొకరు గౌరవించడం ద్వారా నిజమైన శాంతి ఏర్పడుతుందని అన్నారు. ‘మనం ఆశ కోల్పోకూడదు. 20వ శతాబ్దమంతా యుద్ధం, రక్తపాతమయం. 21వ శతాబ్దం చర్చల శతాబ్దంగా ఉండాలి’ అని తన వెబ్సైట్లో పేర్కొన్నారు.
కాగా, టిబెటన్ల అణిచివేత, చైనా కమ్యూనిస్ట్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటుకు నాయకత్వం వహించిన దలైలామా 1959లో టిబెట్ నుంచి పారిపోయి భారత్‌కు వచ్చారు. నాటి నుంచి ప్రవాస ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

