Woman Kills Children to Elope | ప్రియుడితో పారిపోయేందుకు.. పిల్లలను చంపిన మహిళ
Woman Kills Children to Elope | ప్రియుడితో కలిసి పారిపోయేందుకు పిల్లల అడ్డు తొలగించుకోవాలని మహిళ భావించింది. గొంతు నొక్కి వారిని చంపింది. పిల్లలు నిద్రపోతున్నట్లుగా భర్తను నమ్మించేందుకు ప్రయత్నించింది. చివరకు అసలు గుట్టును పోలీసులు రట్టు చేశారు.
ముంబై: ప్రియుడితో కలిసి పారిపోయేందుకు పిల్లల అడ్డు తొలగించుకోవాలని మహిళ భావించింది. గొంతు నొక్కి వారిని చంపింది. పిల్లలు నిద్రపోతున్నట్లుగా భర్తను నమ్మించేందుకు ప్రయత్నించింది. చివరకు అసలు గుట్టును పోలీసులు రట్టు చేశారు. (Woman Kills Children to Elope) మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కిహిమ్ ప్రాంతంలో నివసిస్తున్న 25 ఏళ్ల శీతల్‌కు ఐదేళ్ల కుమార్తె ఆరాధ్య, మూడేళ్ల కుమారుడు సార్థక్ ఉన్నారు. వివాహేతర సంబంధం ఉన్న ప్రియుడు సాయినాథ్ జాదవ్‌తో కలిసి పారిపోయేందుకు పిల్లలు అడ్డుగా ఉన్నారని ఆమె భావించింది. మార్చి 31న గొంతు నొక్కి వారిని చంపింది.
కాగా, శీతల్ భర్త సదానంద్ ఇంటికి తిరిగి వచ్చాడు. పిల్లలు బెడ్‌పై అచేతనంగా ఉండటాన్ని గమనించాడు. భార్యను అడగ్గా వారు నిద్రపోతున్నారని ఆమె చెప్పింది. అనుమానించిన సదానంద్ పిల్లలను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే వారు మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరు పిల్లల మృతిపై దర్యాప్తు చేపట్టారు. శీతల్, సాయినాథ్ జాదవ్ మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుసుకున్నారు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయని గ్రహించారు. దీంతో పోలీసులు శీతల్‌ను గట్టిగా ప్రశ్నించగా అసలు విషయం చెప్పింది. ప్రియుడు సాయినాథ్తో పారిపోయేందుకు అడ్డుగా ఉన్న పిల్లలను గొంతునొక్కి చంపినట్లు ఒప్పుకుంది. శీతల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

