పది లక్షల కారు కావాలా?

- జేబులో 10 రూపాయలైనా ఉన్నాయా?
- కార్ల షోరూమ్‌లో ఓ రైతుకు అవమానం
- గేలి చేసినవారిని ‘క్యాష్’తో కొట్టిన రైతన్న
- అన్నదాతకు మద్దతుగా ట్వీట్ల వర్షం
బెంగళూరు, జనవరి 24: వేషభాషలను బట్టి ‘నువ్వేం కొంటావ్ పో’అని ఓ కారు షోరూమ్ సిబ్బంది ఓ రైతును అవమానించారు. తొలుత ఆవేదన చెందిన అతను తమాయించుకొన్నాడు. తనను అవమానించిన వారికి గుణపాఠం చెప్పాలనుకొన్నాడు. వేషభాషలను బట్టి మనుషులను అంచనా వేయడం ఎంత పొరపాటో నిరూపించాలనుకొన్నాడు. అంతే.. వెంటనే ఇంటికి వెళ్లి నగదు కట్టలు తెచ్చి షోరూమ్ సిబ్బంది ముఖాన కొట్టాడు. ‘అడిగిన డబ్బు కట్టా. తక్షణం కారు డెలివరీ చేయండి’ అంటూ డిమాండ్ చేశాడు. దీంతో నోరెళ్లబెట్టడం షోరూమ్ వారి వంతైంది. ఈ ఘటన కర్ణాటకలోని తమకూరు జిల్లాలో ఇటీవల జరిగింది.
డబ్బుతో రా..
కెంపెగౌడ అనే రైతు తన మిత్రులతో కలిసి ఓ కార్ల షోరూమ్‌కు వెళ్లాడు. బొలేరో పికప్ వెహికిల్ కావాలని అడిగాడు. అతడి వేషభాషలను, వెంటనున్న మిత్రబృందాన్ని చూసిన షోరూమ్ సిబ్బంది వాళ్లను తక్కువగా అంచనా వేశారు. జేబులో పదిరూపాయలు ఉన్నాయా? అని ఓ ఫీల్డ్ ఆఫీసర్ గేలిచేశాడు. కొనేవాళ్లకు సందివ్వండి.. తప్పుకోండి అంటూ వారిని కసురుకొన్నాడు. దీంతో కెంపెగౌడ మనసు చివుక్కుమంది. అయినప్పటికీ, కారు ఖరీదెంత అని సిబ్బందిని అడిగాడు. పదిలక్షలని గర్వంతో ఆఫీసర్ సమాధానమిచ్చాడు. డబ్బు కడితే వెంటనే కారు డెలివరీ చేస్తారా? అని రైతన్న అడిగాడు. ముందు డబ్బుతో రా.. అంటూ ఆఫీసర్ పెడసరిగా సమాధానమిచ్చాడు. దీంతో సరే తెస్తానని మిత్రులతో కలిసి కెంపెగౌడ వెనుదిరిగాడు.
అరగంటలో వెనక్కి..
రైతులు షోరూమ్ నుంచి వెనుదిరగ్గానే అక్కడి సిబ్బంది నవ్వుకొన్నారు. పలాయనం చిత్తగించారని అనుకొన్నారు. అయితే, అరగంటలో కెంపెగౌడ రానేవచ్చాడు. సేల్స్‌మన్ టేబుల్ ముందు అవసరమైన డబ్బును పెట్టాడు. కారు డెలివరీ చేయాలని కోరాడు. అప్పుడు షోరూమ్ సిబ్బంది ప్లేటు మార్చి వివిధ కారణాల వల్ల వెంటనే డెలివరీ ఇవ్వలేకపోతున్నట్టు చెప్పారు. కెంపెగౌడ మిత్ర బృందం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘మాకు వాహనం వద్దు.. అవమానించినందుకు క్షమాపణలు చెప్పాలి’ అని కెంపెగౌడ పోలీసులతో అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్లో వైరల్ అవుతున్నది. కెంపెగౌడకు మద్దతునిస్తూ పలువురు ట్వీట్లు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

