Viral Video : రోడ్డుపై రెండు కార్లలోని వ్యక్తుల మధ్య జరిగిన గొడవ స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. గొడవపడ్డ ఇద్దరూ ఒకరినొకరు కార్లతో పరస్పరం ఢీకొట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులు ఎస్యూవీ వాహనాల (SUV vehicles) తో ఒకరినొకరు ఢీకొట్టుకుంటూ రోడ్డుపై గందరగోళం సృష్టించారు. స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. గురుగ్రామ్ (Gurugram) లోని ధన్వాపూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
దాంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ధన్వాపూర్కు చెందిన ఇద్దరు డ్రైవర్ల మధ్య తలెత్తిన వాగ్వాదం తీవ్రమవడంతో వారు పరస్పరం తమ ఎస్యూవీ వాహనాలతో వీధి పోరాటానికి దిగారు. ఒక వాహనంతో మరొక వాహనాన్ని ఢీకొట్టుకుంటూ నడిరోడ్డుపై బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు గాయాలు అయినట్లు తెలుస్తోంది.
ఎస్యూవీ వాహనాల వీధి పోరాటానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇరువురిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారిద్దరూ స్నేహితులని, చిన్న విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణగా మారిందని తెలిపారు. ఇరుపక్షాల్లో ఎవరూ అధికారికంగా ఫిర్యాదు చేయకపోవడంతో పరస్పర రాజీ ద్వారా ఈ సమస్యను పరిష్కరించామని చెప్పారు.
🚨WHAT IS WRONG WITY MAJORITY OF THAR AND SCORPIO OWNERS #Gurugram: Two friends in Dhanwapur village clashed in road rage, ramming their Mahindra Scorpio N SUVs after one allegedly drove on the wrong side.
Video of the brawl went viral. No injuries; families reached… pic.twitter.com/mUUNczieQZ
— Amitabh Chaudhary (@MithilaWaaala) April 5, 2026