ముంబై: అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా రిలీజై చాలా రోజులైంది. సినిమా మాత్రం ఇంకా జనాల నోళ్లలో నానుతూనే ఉన్నది. అందులోని పాటలు సినిమా విడుదలకు ముందే ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక శ్రీవల్లి పాట (Srivalli song) గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా అందరినీ ఆకట్టుకున్న ఆ పాట ఇప్పుడు ముంబై పోలీసుల మనసును కూడా దోచింది. దీంతో ముంబై పోలీస్ బ్యాండ్కు చెందిన కళాకారులు తమ సంగీత పరికరాలకు పనిచేప్పారు. వాటిలో శ్రీవల్లీ పాట వచ్చేలా వాయించి అందరినీ మైమరిపింప జేశారు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.