నటుడు విజయ్ పార్టీ జెండా ఆవిష్కరణ
తమిళ సినీ నటుడు విజయ్ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ తమిళగ వేట్రి కళగం (టీవీకే) జెండాను గురువారం ఆవిష్కరించారు.
చెన్నై: తమిళ సినీ నటుడు విజయ్ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ తమిళగ వేట్రి కళగం (టీవీకే) జెండాను గురువారం ఆవిష్కరించారు. పనైయూర్‌లోని పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. జెండా పైన, కింద జేగురు (మెరూన్) రంగు, మధ్యలో పసుపు రంగు ఉన్నాయి. మధ్యలో రెండు ఏనుగులు, వాటి మధ్యలో వాగాయ్ పువ్వు ఉంది. వాగాయ్ అంటే తమిళంలో విజయం అని అర్థం.
విజయ్ మాట్లాడుతూ, టీవీకే పార్టీ జెండా వెనుక చారిత్రక ప్రాధాన్యం ఉందని, రాష్ట్ర స్థాయి సమావేశంలో దాని గురించి వివరిస్తానని చెప్పారు. తాను దీనిని జెండాగా భావించడం లేదని, తమిళనాడు భావి తరాల విజయకేతనంగా భావిస్తున్నానని తెలిపారు. విజయ్ పార్టీతో తమిళ రాజకీయాల్లో నూతన అధ్యాయం ప్రారంభమైంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు 2026లో జరుగుతాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

