TN CM Vijay | తమిళనాడు మాజీ సీఎం నివాసానికి సీఎం విజయ్.. సాదర స్వాగతం పలికిన ఎంకే స్టాలిన్.. Video
TN CM Vijay | తమిళనాడు (Tamil Nadu) నూతన ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధ్యక్షుడు విజయ్ (Vijay).. ఇవాళ డీఎంకే అధినేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) నివాసానికి వెళ్లారు. సోమవారం అసెంబ్లీలో నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాలు పూర్తయిన వెంటనే విజయ్.. స్టాలిన్ నివాసానికి బయలుదేరారు. తన ఇంటికి వచ్చిన విజయ్‌కి ఉదయనిధి స్టాలిన్ (Udayanidi Stalin), ఎంకే స్టాలిన్ సాదరంగా స్వాగతం పలికారు.
TN CM Vijay : తమిళనాడు (Tamil Nadu) నూతన ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధ్యక్షుడు విజయ్ (Vijay).. ఇవాళ డీఎంకే అధినేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) నివాసానికి వెళ్లారు. సోమవారం అసెంబ్లీలో నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాలు పూర్తయిన వెంటనే విజయ్.. స్టాలిన్ నివాసానికి బయలుదేరారు. తన ఇంటికి వచ్చిన విజయ్‌కి ఉదయనిధి స్టాలిన్ (Udayanidi Stalin), ఎంకే స్టాలిన్ సాదరంగా స్వాగతం పలికారు. ముందుగా ఉదయనిధి స్టాలిన్.. విజయ్‌కి ఎదురువెళ్లి ఆలింగనం చేసుకున్నారు. తర్వాత ఇంట్లోకి తీసుకెళ్లారు. విజయ్‌కి ఇంట్లో ఎంకే స్టాలిన్ ఎదురుపడగానే రెండు చేతులు జోడించి నమస్కరించారు. వెంటనే ఎంకే స్టాలిన్ కూడా ప్రతి నమస్కారం చేశారు.
అనంతరం ఎంకే స్టాలిన్.. విజయ్‌కి శాలువా కప్పి సత్కరంచారు. విజయ్ కూడా స్టాలిన్‌కు శాలువా కప్పి సత్కారం చేశారు. తన నివాసానికి వచ్చిన విజయ్‌తో మాజీ సీఎం స్టాలిన్, మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కాసేపు ముచ్చటించారు. అయితే ఈ సందర్భంగా వారు ఏం మాట్లాడుకున్నారు అనే వివరాలు మాత్రం వెల్లడి కాలేదు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంకే స్టాలిన్ ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను డీఎంకే శాసనసభాపక్షనేతగా ఎన్నుకున్నారు. దాంతో అసెంబ్లీలో సీఎం విజయ్, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ల మధ్య వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉంది. కాగా విజయ్ స్టాలిన్ నివాసానికి వెళ్లిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు..
#WATCH | Tamil Nadu CM Vijay visits former CM & DMK President MK Stalin at his residence in Chennai pic.twitter.com/NImbuoMnhh
— ANI (@ANI) May 11, 2026
#WATCH | Chennai: Tamil Nadu CM Vijay meets former CM and DMK President MK Stalin and former Dy CM Udhayanidhi Stalin at their residence.
(Source: DMK) pic.twitter.com/xsmH7uzoeZ
— ANI (@ANI) May 11, 2026
ఇక ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన మెజారిటీ రాలేదు. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ఈ క్రమంలో డీఎంకే మిత్రపక్షాలైన కాంగ్రెస్, వీసీకే, సీపీఐ, సీపీఎంల మద్దతుతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో తమ మిత్రపక్షాలకు స్టాలిన్ పూర్తి స్వేచ్ఛ కల్పించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకు పరోక్షంగా సహకరించిన స్టాలిన్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకే విజయ్ ఆయనను కలిసినట్లు తెలుస్తోంది. సీఎం బాధ్యతలు చేపట్టాక విజయ్.. స్టాలిన్‌ను కలవడం ఇదే తొలిసారి. ఈ ఇద్దరి భేటీ తమిళ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

