Vijay Divorce Case | టీవీకే చీఫ్ విజయ్ విడాకుల కేసు.. తదుపరి విచారణ జూన్ 15కు వాయిదా
Vijay Divorce Case | తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ప్రచారం హోరాహోరీగా సాగుతున్న తరుణంలో నటుడు, రాజకీయ నాయకుడు విజయ్‌కి సంబంధించిన విడాకుల కేసు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. తన భార్య సంగీత నుంచి విడాకులు కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై చెంగల్పట్టు (Chengalpattu) ఫ్యామిలీ కోర్టు (Family Court) సోమవారం విచారణ జరిపింది.
Vijay Divorce Case : తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ప్రచారం హోరాహోరీగా సాగుతున్న తరుణంలో నటుడు, రాజకీయ నాయకుడు విజయ్‌కి సంబంధించిన విడాకుల కేసు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. తన భార్య సంగీత నుంచి విడాకులు కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై చెంగల్పట్టు (Chengalpattu) ఫ్యామిలీ కోర్టు (Family Court) సోమవారం విచారణ జరిపింది. అయితే ఇరుపక్షాల అభ్యర్థన మేరకు కేసు విచారణను న్యాయస్థానం జూన్ 15వ తేదీకి వాయిదా వేసింది.
తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయ్.. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన విడాకుల కేసు విచారణకు వచ్చింది. గతంలో ఈ కేసులో వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు విజయ్‌కు సమన్లు జారీ చేసింది. అయితే సోమవారం ఇరుపక్షాల న్యాయవాదులు కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి, విచారణను వాయిదా వేయాలని కోరారు. విజయ్, సంగీత ఇద్దరూ పరస్పర అంగీకారంతో స్నేహపూర్వకంగా విడిపోవాలని నిర్ణయించుకున్నారని వారి న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు.
విడాకులకు సంబంధించిన కీలక అంశాలైన భరణం, ఆస్తుల పంపకం వంటి వాటిపై ఇప్పటికే ఇరువర్గాల మధ్య అవగాహన కుదిరినట్లు తెలిసింది. ముఖ్యంగా వారి పిల్లల భవిష్యత్తు భద్రతకు సంబంధించిన విషయాలపై స్పష్టమైన ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తున్నది. అయితే ఈ ఆర్థికపరమైన వివరాలను కోర్టుకు సమర్పించిన పిటిషన్లో వెల్లడించలేదు. ఈ నెల 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారని, భద్రతా కారణాలు, ఇతర కార్యక్రమాలవల్ల ఆయన కోర్టుకు హాజరుకాలేకపోతున్నారని న్యాయవాదులు తెలిపారు.
ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. కేసు విచారణను వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. రాజకీయంగా ఎంతో కీలకమైన ఈ సమయంలో విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ పరిణామం మీడియాలో చర్చకు దారితీసింది. ఇరుపక్షాల మధ్య ఒప్పందం కుదరడంతో ఈ విడాకుల ప్రక్రియ త్వరగా పూర్తయ్యే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

