న్యూఢిల్లీ : దేశీ పెండ్లిండ్లు అంటే సంగీత్, బారాత్ అంటూ ఆ సందడే వేరు. పెండ్లి వేడుకలో ఓ సిక్కు జంట డ్యాన్స్ చేసిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్యాన్స్ ఫ్లోర్లో కూల్ స్టెప్స్‌తో వారు ఇచ్చిన క్రేజీ మూమెంట్స్ నెటిజన్లను అమితంగా ఆకట్టుకున్నాయి.
Rate The Vibes From 1-10
— ਹਤਿੰਦਰ ਸਿੰਘ (@Hatindersinghr3) February 16, 2023
హతీందర్ సింగ్ ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ వీడియోలో యువ జంట రెమా, సెలెనా గోమెజ్ల కామ్ డౌన్ సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. నవ దంపతులు డ్యాన్స్ పెర్ఫామ్ చేస్తుండగా చుట్టూ చేరిన అతిధులు చప్పట్లు కొడుతూ వారిని ప్రోత్సహించారు. వీరి డ్యాన్స్ పెర్ఫామెన్స్‌కు ఫిదా అయిన ఇంటర్నెట్ పదికి పది మార్కులు ఇచ్చేసింది.
పెండ్లి దుస్తుల్లో కట్టూబొట్టూ చెదరకుండా డ్యాన్స్ చేయడం మామూలు విషయం కాదని ఓ యూజర్ కామెంట్ చేయగా, వధువు తమ వివాహ వేడుకను ఆస్వాదించింది కాబట్టే పదికి పది మార్కులంటూ మరో యూజర్ రాసుకొచ్చారు. మహిళలు తమ పెండ్లి వేడుకను ఎంజాయ్ చేయాలని మరో యూజర్ కామెంట్ చేశారు.