న్యూఢిల్లీ, ఆగస్టు 10: ఎక్స్(ట్విట్టర్)లో త్వరలో వీడియో కాల్స్ సౌకర్యం అందుబాటులోకి రానుంది. చైనీస్ యాప్ వీ చాట్ లాగా తమ యాప్‌లోనూ అన్ని ఫీచర్స్ ఉండేలా ప్రయత్నిస్తున్నామని ఎక్స్ సీఈవో లిండా యాకరినో గురువారం వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫోన్ నెంబర్ లేకుండానే ఎవరైనా తమ ప్లాట్ ఫామ్ నుంచి వీడియో చాట్ కాల్స్ చేయవచ్చన్నారు. త్వరలోనే సుదీర్ఘ నిడివి వీడియోలు, క్రియేటర్ సబ్స్క్రిప్షన్స్, డిజిటల్ చెల్లింపు సౌకర్యాలను తీసుకొచ్చే ఆలోచనల్లో ఉన్నట్టు చెప్పారు. ట్విట్టర్ పేరును ఇటీవల ‘ఎక్స్’గా మార్చిన విషయం తెలిసిందే.