Jagdeep Dhankhar | రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. అఖిలపక్షంతో సమావేశమైన రాజ్యసభ చైర్మన్
Jagdeep Dhankhar | ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్కర్ ఆదివారం ఢిల్లీలోని తన నివాసంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ బడ్జెట్ రెండో విడుత సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి.
Jagdeep Dhankhar | ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్కర్ ఆదివారం ఢిల్లీలోని తన నివాసంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ బడ్జెట్ రెండో విడుత సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. తొలి విడుత బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక రెండో విడుత సమావేశాలు సోమవారం నుంచి మొదలై ఏప్రిల్ 6వ తేదీ వరకు కొనసాగనున్నాయి. దాదాపు నెల రోజుల తర్వాత సమావేశాలు మళ్లీ ప్రారంభమవుతున్నాయి.
సోమవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 సంవత్సరానికి జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంత బడ్జెట్‌ను సైతం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. మరో వైపు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానుండడంతో విపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సోమవారం ఉదయం సమావేశంకానున్నాయి.
పార్లమెంట్ కాంప్లెక్స్‌లోని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో ఉదయం 10గంటలకు విపక్ష నేతలు సమావేశం కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ కార్యాలయంలో కాంగ్రెస్ ఎంపీలు సమావేశమై పార్టీ వ్యూహంపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీల నేతలే లక్ష్యంగా దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం, అదానీ గ్రూప్‌పై ఆరోపణలు, చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన, ధరల పెరుగుదల, నిరుద్యోగం తదితర సమస్యలపై కేంద్రాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి.
కాంగ్రెస్ అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నది. అదానీ-హిండెన్ బర్గ్ వ్యవహారంపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలో మరోసారి ప్రభుత్వాన్ని జేపీసీ కోసం డిమాండ్ చేసే అవకాశం ఉంది. అలాగే ఇటీవల ఈడీ, సీబీఐ దాడులపై సైతం కేంద్రాన్ని నిలదీసే అవకాశాలున్నాయి. ఇదిలా ఉండగా.. రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్కర్ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సభకు సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

