Sengottaiyan : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రను తిరగరాసిన తమిళ వెట్రి కజకం(TVK) అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. 107 స్థానాల్లో పాగా వేసిన టీవీకే తొలి అడుగులోనే అధికారాన్ని ఛేజిక్కించుకోనుంది. అయితే.. ఎన్నికల్లో ఆ పార్టీ టికెట్‌తో పోటీ చేసిన పలువురు వార్తల్లో నిలుస్తున్నారు. వీరిలో 70 ఏళ్ల కేఏ సెన్గొట్టయన్ (KA Sengottaiyan) పేరు నెట్టింట వైరలవుతోంది. పదోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన.. 71 వేల ఓట్లు సాధించడం విశేషం.
ఏఐడీఎంకేలో క్రీయాశీలక నేతగా ఎదిగిన కేఏ సెన్గొట్టయన్ విజయ్ పార్టీ తరఫున తన విజయపరంపర కొనసాగించారు. అప్పటికే అప్పటికే 9 సార్లు ఎమ్యేల్యేగా గెలుపొందిన ఆయన ఈసారి టీవీకే అభ్యర్థిగానూ భారీ విజయాన్నందుకున్నారు. టీవీకే తీర్ధం పుచ్చకున్న ఆయన గొబిచెట్టిపలయం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.
DMK fields candidates. AIADMK fields candidates. But Gobichettipalayam fields a legacy. K.A. Sengottaiyan’s experience isn’t just political; it’s historical ❤️🥳 @KASengottaiyan @TVKVijayHQ#TVKVijay #TVKVijayHQ #TVKVijay pic.twitter.com/mUn0Z4p2PU
— Classic Prasanna (@ClassicPrasanna) May 4, 2026
రాజకీయ చతురుడిగా పేరొందిన ఆయన సమీప ప్రత్యర్థి, డీఎంకే పార్టీకి చెందిన ఎన్ నల్లసివమ్ను చిత్తు చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన సెన్గొట్టయన్ 13 వేల ఓట్ల మెజార్టీతో నల్లసివమ్పై విజయం సాధించారు. సెన్గొట్టయన్ ఒకరే కాదు.. టీవీకే టికెట్‌తో గెలిచిన అనామకులూ ఉన్నారు. అధినేత విజయ్ కారు డ్రైవర్ కుమారుడు, అటో డ్రైవర్ సైతం తొలిసారి శాసనసభలో అడుగు పెట్టబోతున్నారు.
HISTORY MADE IN TAMIL NADU 🚨🔥
K. A. Sengottaiyan creates a RECORD by winning from Gobichettipalayam for the 10th consecutive time — a feat rarely seen in Indian politics!
From experience to unmatched grassroots connect, this victory isn’t just a win… it’s a legacy being… pic.twitter.com/B372XaHTYp
— 🚨NextGenNewsroom (@nextgennewsroom) May 4, 2026