LK Advani | ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అద్వానీ
LK Advani | బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ (LK Advani ) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
LK Advani | బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ (LK Advani ) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నిన్న తన ఇంట్లో తీవ్ర అస్వస్థతకు గురైన అద్వానీని కుటుంబ సభ్యులు హుటాహుటిన ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి 10:30 గంటల సమయంలో ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఎయిమ్స్‌లోని పలు విభాగాల వైద్యులు అద్వానీని నిశితంగా పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో ఇవాళ డిశ్చార్జ్ చేశారు (Discharged From AIIMS). ‘వయో సంబంధిత అనారోగ్య సమస్యలతో అద్వానీ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు’ అని ఎయిమ్స్ అధికారి తెలిపారు.
కాగా, మూడు నెలల కిందటే కేంద్ర ప్రభుత్వం అద్వానీకి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రదానం చేసిన విషయం తెలిసిందే. వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్న అద్వానీ రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ అవార్డుల కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. దీంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా అద్వానీ నివాసానికి వెళ్లి పురస్కారాన్ని అందించారు.
Also Read..
Kallakurichi | కల్తీసారా ఘటనలో 63కు పెరిగిన మృతులు.. సీబీఐ విచారణకు అన్నాడీఎంకే డిమాండ్
Russia | పట్టాలు తప్పి నదిలో పడిపోయిన రైలు బోగీలు.. 70 మందికి గాయాలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

