గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ కేరళ హైకోర్టుకు అక్కడి వీసీలు
Kerala Vice Chancellors | బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్ల కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పంజాబ్, కేరళ రాష్ట్రాల్లో
తిరువనంతపురం: బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్ల కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పంజాబ్, కేరళ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, గవర్నర్లకు మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. యూనివర్సిటీలకు వీసీల నియామకంలో కేరళ ప్రభుత్వం నిబంధనలు పాటించలేదంటూ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆదివారం రాష్ట్రంలోని 9 యూనివర్సిటీల వీసీల రాజీనామాకు ఆదేశించారు. అంతేగాక సోమవారం ఉదయం 11:30 గంటల లోపల వీసీల రాజీనామాలు తన ముందు ఉండాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
దీనిపై ఆ 9 యూనివర్సిటీల వైస్ ఛాన్సెలర్లు ఇవాళ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. వారి పిటిషన్లను స్వీకరించిన హైకోర్టు ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక సిట్టింగ్ ద్వారా విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. కాగా, కేరళలోని ఏపీజే అబ్దుల్ కలాం టెక్నాలజికల్ యూనివర్సిటీ వీసీ నియామకం యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ సుప్రీంకోర్టు ఇటీవల ఆ నియామకాన్ని రద్దు చేసింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 9 యూనివర్సిటీల వీసీలు రాజీనామా చేయాలని గవర్నర్ ఆదేశాలు జారీచేశారు. దీనిపై వారు హైకోర్టును ఆశ్రయించారు. అంతకుముందు కూడా కేరళ సర్కారు మద్యం, లాటరీని ప్రధాన ఆదాయ వనరుగా చూస్తోందంటూ గవర్నర్ మండిపడ్డారు. ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రం డ్రగ్స్‌కు అడ్డా అని, త్వరలోనే కేరళ దాన్ని దాటేస్తదని గవర్నర్ వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

