Valmiki Scam | సీబీఐ చేతికి వాల్మీకి స్కామ్.. సమగ్రంగా దర్యాప్తు చేయాలని కర్ణాటక హైకోర్టు ఆదేశం
Valmiki Scam | కర్ణాటకతోపాటు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన వాల్మీకి కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకొన్నది. ఈ కుంభకోణాన్ని విస్తృత స్థాయిలో దర్యాప్తు చేయాలంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు కర్ణాటక హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
- కాంగ్రెస్ నేతలకు క్లీన్చిట్ ఇచ్చిన సిట్‌కూ ఝలక్
- సేకరించిన సాక్ష్యాలు సీబీఐకి ఇవ్వాలని కోర్టు ఆదేశం
- అంతర్గత కుమ్ములాటలతో ఇప్పటికే సంక్షోభంలో ఉన్న సిద్ధరామయ్య ప్రభుత్వానికి ఎదురుదెబ్బే: విశ్లేషకులు
Valmiki Scam | హైదరాబాద్, జూలై 1 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): కర్ణాటకతోపాటు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన వాల్మీకి కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకొన్నది. ఈ కుంభకోణాన్ని విస్తృత స్థాయిలో దర్యాప్తు చేయాలంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు కర్ణాటక హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలు, కీలక పత్రాలను సీబీఐకి ఇవ్వాల్సిందిగా సిట్ అధికారులను ధర్మాసనం ఆదేశించింది.
వాల్మీకి స్కామ్ గురించి సిట్ చేసిన దర్యాప్తులో లోపాలు ఉన్నాయంటూ బీజేపీ నాయకులు బసనగౌడ పాటిల్ యత్నాల్, అరవింద్ లింబావలి సహా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం.. కేసు దర్యాప్తును సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేసింది. కేవలం సిట్ దర్యాప్తులోని లోపాల మీదనే కాకుండా స్కామ్‌కు సంబంధించి పూర్తిస్థాయిలో విస్తృతమైన దర్యాప్తును చేయాల్సిందిగా ధర్మాసనం ఈ సందర్భంగా సీబీఐని ఆదేశించింది.
సిద్ధు సర్కారుకు ఎదురుదెబ్బ
వాల్మీకి స్కామ్‌కు సంబంధించిన దర్యాప్తును కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కు తొలుత అప్పగించారు. అయితే, కేసులో ప్రధాన నిందితులుగా చెప్తున్న కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి బీ నాగేంద్రతో పాటు వాల్మీకి బోర్డు చైర్మన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్కు నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి విచారణ చేయకుండానే సిట్ అధికారులు వారిద్దరికీ క్లీన్చిట్ ఇచ్చారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇదే సమయంలో వాల్మీకి స్కామ్‌లో బీ నాగేంద్రనే కీలక సూత్రధారి అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నిర్ధారించింది. ఈ మేరకు గతంలో ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసి నాగేంద్రను అరెస్టు చేసింది.
అనంతరం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఈడీ దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఈ క్రమంలో వాల్మీకి కేసు దర్యాప్తును సిట్ నుంచి సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం సంచలనంగా మారింది. అంతర్గత కుమ్ములాటలు, సీఎం కుర్చీలాటతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన సిద్ధరామయ్య ప్రభుత్వానికి కోర్టు తీర్పు పెద్ద ఎదురు దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
ఏమిటీ స్కామ్? హైదరాబాద్‌కు లింకేంటీ?
‘కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్’కు చెందిన పలు బ్యాంకు ఖాతాల్లో ఉండాల్సిన రూ.187 కోట్లు పక్కదారి పట్టాయి. వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్స్ సూపరింటెండెంట్ పీ చంద్రశేఖరన్ కిందటేడాది మేలో ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కుంభకోణం వెలుగు చూసింది. ఈ స్కామ్ గురించి చంద్రశేఖరన్ తన ఆరు పేజీల సూసైడ్ నోటులో పేర్కొన్నారు. యూనియన్ బ్యాంకు సైతం తమ బ్యాంకులోని వాల్మీకి కార్పొరేషన్ ఖాతా నుంచి చట్టవిరుద్ధంగా నగదు బదిలీ జరిగిందని ఫిర్యాదు చేసింది. సర్వత్రా ఒత్తిడి పెరగడంతో సిద్ధరామయ్య ప్రభుత్వం.. సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈడీ సైతం రంగంలోకి దిగింది.
లోక్‌సభ ఎన్నికల్లో మద్యం, డబ్బు పంచడం కోసమే ‘వాల్మీకి కార్పొరేషన్’ నిధులను అక్రమంగా వాడుకొన్నట్టు ఈడీ దర్యాప్తులో ప్రాథమికంగా తేలింది. ఈడీ చార్జిషీట్ ప్రకారం.. వాల్మీకి స్కామ్ లింకులు హైదరాబాద్‌కు కూడా పాకినట్టు అర్థమవుతున్నది. హైదరాబాద్‌కు చెందిన బిల్డర్ సత్యనారాయణ వర్మతో కలిసి రూ.21 కోట్ల నిధులను నాగేంద్ర పక్కదారి పట్టించినట్టు ఈడీ ఆరోపించింది. బెంగళూరుతో పాటు బళ్లారి నుంచి ఈ డబ్బులను వివిధ ప్రాంతాలకు అక్రమంగా పంపించారని, లోక్‌సభ ఎన్నికల్లో వీటిని వినియోగించినట్టు ఈడీ గుర్తించింది.
ఎవరీ సత్యనారాయణ వర్మ?
వాల్మీకి స్కామ్‌లో ఈడీ ప్రధానంగా ప్రస్తావించిన సత్యనారాయణ వర్మ హైదరాబాద్‌కు చెందిన బిల్డర్. ఈయన వాల్మీకి కార్పొరేషన్‌కు సంబంధించిన నిధులను ‘ఫస్ట్ ఫైనాన్స్ క్రెడిట్ కో ఆపరేటీవ్ సొసైటీ’ ద్వారా దారి మళ్లించినట్టు ఈడీ తన చార్జిషీట్లో పేర్కొన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ కుంభకోణానికి సంబంధించిన నిధులతోనే సత్యనారాయణ వర్మ రూ.3.3 కోట్లతో లాంబోర్గిని కారును కూడా కొన్నట్టు ఈడీ గుర్తించింది.
ఈ కుంభకోణంలో సత్యనారాయణ వర్మతోపాటు ఇటకారి సత్యనారాయణ, చంద్రమోహన్, నాగేశ్వరరావులు కూడా ఉన్నారు. తెలంగాణకు చెందిన ఇద్దరు కీలక కాంగ్రెస్ నాయకులకు సత్యనారాయణ వర్మ అత్యంత సన్నిహితుడనే ఆరోపణలున్నాయి. పక్కదారి పట్టించిన కార్పొరేషన్ నిధులను లోక్‌సభ ఎన్నికల్లో వినియోగించారని ఈడీ పేర్కొన్నది. సత్యనారాయణ వెనుక ఎవరున్నారనేది చర్చనీయాంశమైంది. ఈ నిధులకు సంబంధించి కర్ణాటక మంత్రి ప్రత్యేకంగా హైదరాబాద్‌కు కూడా వచ్చి చర్చల్లో పాల్గొన్నట్టు సమాచారం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

