Uttarakhand | మంచు చరియల కింద 25 ప్రాణాలు.. ఉత్తరాఖండ్ చమోలీలో దుర్ఘటన
ఉత్తరాఖండ్‌లో మంచు చరియలు బీభత్సం సృష్టించాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న హిమపాతం సరిహద్దు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నది.
- బద్రీనాథ్‌లో చరియలు విరిగిపడి చిక్కుకున్న 57 మంది కార్మికులు
- 32 మందిని రక్షించిన సిబ్బంది
Uttarakhand | డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో మంచు చరియలు బీభత్సం సృష్టించాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న హిమపాతం సరిహద్దు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నది. ఈ క్రమంలో చమేలి జిల్లాలోని మన అనే సరిహద్దు గ్రామంలో చమోలి-బద్రీనాథ్ రహదారిపై ఏర్పాటు చేసిన శిబిరంపై పెద్దయెత్తున మంచు చరియలు విరుచుకు పడటంతో అక్కడ పనిచేస్తున్న 57 మంది బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) కార్మికులు చిక్కుకుపోయారు. శుక్రవారం ఉదయం 7.15 గంటలకు ఇది చోటుచేసుకోగా, ఆ సమయానికి కార్మికులు ఎనిమిది కంటైనర్లు, ఒక షెడ్లో ఉన్నారు. దీంతో అధికారులు అప్రమత్తమై వారిని బయటకు తీసేందుకు సహాయ కార్యక్రమాలు చేపట్టారు.
అధికారుల కథనం ప్రకారం ఇప్పటివరకు 32 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చి, గ్రామంలో ఏర్పాటు చేసిన ఐటీబీపీ శిబిరంలో చికిత్స అందిస్తున్నారు. వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రతికూల వాతావరణం, భారీ హిమపాతం ఏర్పడే ప్రమాదం ఉండటంతో సహాయ కార్యక్రమాలు తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో మిగిలిన 25 మంది కార్మికుల గురించి ఆందోళన వ్యక్తమవుతున్నది. బద్రీనాథ్‌లో జరిగిన ప్రమాదంలో మంచు చరియల కింద చిక్కుకున్న వారినందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.
టూత్‌పేస్ట్ తిని ప్రాణం నిలుపుకున్నాడు!
చైనాలోని కిన్‌లింగ్ పర్వతారోహణ కోసం ఫిబ్రవరి 8న బయల్దేరిన సున్ లియాంగ్ (18) అతి కష్టం మీద ప్రాణాలతో బయటపడ్డాడు. ఎలక్ట్రానిక్ డివైసెస్ పనిచేయకపోవడంతో బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. చేసేదేమీ లేక నెమ్మదిగా కిందకు దిగడం ప్రారంభించాడు. చాలాసార్లు పట్టు తప్పి, పడిపోయాడు. కుడి చేయి ఎముక విరిగిపోయింది కూడా. ఆహారం లేకపోవడంతో మంచును, టూత్‌పేస్ట్‌ను తింటూ కాలం గడిపాడు. 10 రోజుల తర్వాత అతడిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

