హెచ్-1బీ ప్రోగ్రామ్ రద్దుకు.. అమెరికా చట్టసభలో బిల్లు
వచ్చే ఏడాదినాటికి హెచ్-1బీ కార్యక్రమానికి ముగింపు పలకాలంటూ అమెరికా చట్టసభ సభ్యుడు ఒకరు బిల్లును ప్రవేశపెట్టారు. అమెరికా వలస విధానం, జాతీయత చట్టాన్ని, వీసా కార్యక్రమాన్ని రద్దు చేయాలని ప్రతిపాదిస్తూ ఫ్లోరిడా ప్రతినిధి, రిపబ్లికన్ గ్రెగ్ స్టీబ్ ‘ఎక్సైల్ యాక్ట్' పేరుతో ఈ బిల్లును తీసుకొచ్చారు.
వాషింగ్టన్, ఫిబ్రవరి10 : వచ్చే ఏడాదినాటికి హెచ్-1బీ కార్యక్రమానికి ముగింపు పలకాలంటూ అమెరికా చట్టసభ సభ్యుడు ఒకరు బిల్లును ప్రవేశపెట్టారు. అమెరికా వలస విధానం, జాతీయత చట్టాన్ని, వీసా కార్యక్రమాన్ని రద్దు చేయాలని ప్రతిపాదిస్తూ ఫ్లోరిడా ప్రతినిధి, రిపబ్లికన్ గ్రెగ్ స్టీబ్ ‘ఎక్సైల్ యాక్ట్’ పేరుతో ఈ బిల్లును తీసుకొచ్చారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.
‘అవినీతితో కూడిన హెచ్-1బీ కార్యక్రమంతో అమెరికా ఉద్యోగులు చాలాకాలంగా మోసపోతున్నారు. చౌకగా లభ్యమవుతున్న విదేశీ ఉద్యోగులను దిగుమతి చేసుకోవటం ద్వారా తమ ఆదాయాన్ని కాపాడుకోవడానికి కార్పొరేషన్లు ఈ వ్యవస్థను పదేపదే దుర్వినియోగం చేస్తున్నాయి. ఇది వేతనాలను అణచివేసింది. దీనివల్ల లక్షలాది మంది అమెరికన్లు మంచి జీతం పొందే ఉద్యోగాలకు దూరమయ్యారు’ అని స్టీబ్ తెలిపారు. ఇలాంటిదే ఓ బిల్లును గతంలో టేలర్ గ్రీన్ కూడా అమెరికా చట్టసభలో ప్రవేశపెట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

