యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ ఫలితాలు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష-2026 ఫలితాలను గురువారం ప్రకటించింది. 2,526 మంది అభ్యర్థులను తదుపరి దశ అయిన పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ)కి ఎంపిక చేసింది.
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష-2026 ఫలితాలను గురువారం ప్రకటించింది. 2,526 మంది అభ్యర్థులను తదుపరి దశ అయిన పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ)కి ఎంపిక చేసింది. అభ్యర్థులు తమ ఫలితాలను యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ upsc.gov.inలో చూసుకోవచ్చు. సివిల్స్ మెయిన్స్ పరీక్షలు ఆగస్టు 21 నుంచి 30 వరకు నిర్వహించారు.
ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించి మెయిన్ రాసేందుకు మొత్తం 13, 343 మంది ఎంపికయ్యారు. వారిలో 2,526 మంది ఇంటర్వ్యూ దశకు అర్హత సాధించారు. న్యూఢిల్లీలోని షాజహాన్ రోడ్డులో ఉన్న ధౌల్పూర్ హౌస్ యూపీఎస్సీ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూ తేదీలు, సమయాలను కమిషన్ త్వరలో ప్రకటించనుంది. అభ్యర్థులు యూపీఎస్సీ వెబ్సైట్ లేదా ఆన్లైన్ దరఖాస్తు పోర్టల్ నుంచి ఈ-సమ్మన్ లేఖలను డౌన్లోడ్ చేసుకోవాలి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

