సివిల్స్ ఇంటర్వ్యూలో రికార్డ్ సృష్టించిన 9వ ర్యాంకర్ డాక్టర్ అపల
Doctor Apala Mishra | సివిల్స్ ఇంటర్వ్యూలో 9వ ర్యాంకర్ డాక్టర్ అపల రికార్డు సృష్టించారు. గతేడాది నమోదైన రికార్డును ఆమె చెరిపేశారు. ఇంటర్వ్యూలో 275 మార్కులకు గానూ అపల 215 మార్కులు సాధించింది. గత సంవత్సరం ఇంటర్వ్యూలో

న్యూఢిల్లీ : సివిల్స్ ఇంటర్వ్యూలో 9వ ర్యాంకర్ డాక్టర్ అపల రికార్డు సృష్టించారు. గతేడాది నమోదైన రికార్డును ఆమె చెరిపేశారు. ఇంటర్వ్యూలో 275 మార్కులకు గానూ అపల 215 మార్కులు సాధించింది. గత సంవత్సరం ఇంటర్వ్యూలో అత్యధికంగా 212 మార్కులు వచ్చాయి. సివిల్స్ ఫలితాలు గత వారం విడుదల కాగా, మెయిన్స్, ఇంటర్వ్యూ మార్కులను మంగళవారం విడుదల చేసింది యూపీఎస్సీ.
40 నిమిషాల పాటు సాగిన ఇంటర్వ్యూ
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన డాక్టర్ అపల మూడో ప్రయత్నంలో 9వ ర్యాంకు సాధించింది. ఆమె ఇంటర్వ్యూ 40 నిమిషాల పాటు సాగింది. అన్ని ప్రశ్నలకు అపల సమాధానం ఇచ్చారు. ఇంటర్వ్యూ ప్రారంభంలో కొద్దిగా ఆందోళనకు గురైనప్పటికీ.. తర్వాత తనలో ఆత్మ విశ్వాసం పెంపొందించుకున్నానని అపల చెప్పుకొచ్చారు. అలా అన్ని ప్రశ్నలకు తడబడకుండా సమాధానం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇంటర్వ్యూ రౌండ్ అనేది చాలా ప్రధానమైనది అని తెలిపారు. తమ ప్రెజెంటేషన్‌తో పాటు పర్సనాలిటీ స్కిల్స్‌ను బోర్డు మెంబర్లు పరిశీలిస్తారని పేర్కొన్నారు.
ఐ విల్ బీ అండర్ 50
అపల సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న క్రమంలో ఆమె ఒక ప్రణాళికబద్ధంగా చదివేది. ఏడాది క్రితం తన గదిలో ఒక పోస్టర్‌ను అపల ఏర్పాటు చేసుకుంది. ఆ పోస్టర్లో ఐ విల్ బీ అండర్ 50 అని రాసి ఉంటుంది. ఆ పోస్టర్‌ను డే అండ్ నైట్ చూస్తూ.. తాను సాధించే లక్ష్యంపై గురి పెట్టేది. చదువు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు తండ్రితో కలిసి ప్రతి రోజు 30 నుంచి 40 నిమిషాల పాటు టేబుల్ టెన్నిస్ ఆడేవారు. అపల తండ్రి ఆర్మీ కల్నల్, తల్లి ఢిల్లీ యూనివర్సిటీలో హిందీ ప్రొఫెసర్.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

