Competitive Exams | పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే పదేండ్ల జైలు.. రూ.కోటి వరకు జరిమానా!
పోటీ పరీక్షల్లో అక్రమాలను నిరోధించడానికి కేంద్రం ఒక చట్టాన్ని తీసుకు రానుంది. దీనికి సంబంధించిన బిల్లును వచ్చే సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ కొత్త బిల్లు ప్రకారం పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారికి గరిష్ఠంగా 10 ఏండ్ల జైలు శిక్షతో పాటు రూ.కోటి వరకు జరిమానా విధిస్తారు.
- 5న పార్లమెంట్లో బిల్లు
Competitive Exams | న్యూఢిల్లీ, జనవరి 31: పోటీ పరీక్షల్లో అక్రమాలను నిరోధించడానికి కేంద్రం ఒక చట్టాన్ని తీసుకు రానుంది. దీనికి సంబంధించిన బిల్లును వచ్చే సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ కొత్త బిల్లు ప్రకారం పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారికి గరిష్ఠంగా 10 ఏండ్ల జైలు శిక్షతో పాటు రూ.కోటి వరకు జరిమానా విధిస్తారు.
సోమవారం ప్రవేశపెట్టే ఈ బిల్లు విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని తేవడం లేదని, పరీక్షల పేరుతో అక్రమాలకు పాల్పడే మాఫియా, వ్యవస్థీకృత ముఠాలతో పాటు, వీటితో కుమ్మక్కయ్యే ప్రభుత్వ అధికారులు, సిబ్బంది కోసమని ఒక ఉన్నతాధికారి స్పష్టం చేశారు. దీనిపై అధ్యయనం చేసిన అత్యున్నత స్థాయి సాంకేతిక కమిటీ కంప్యూటరైజ్డ్ పరీక్షా విధానం అత్యంత సురక్షితమని సిఫార్సు చేసింది. ముఖ్యంగా జేఈఈతో పాటు కేంద్ర యూనివర్సిటీలతో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షలలో అక్రమాల నిరోధానికి ఈ బిల్లును తెస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

