ఇంకా 39 సార్లు కాల్పులు జరుపుతాం.. టీచర్‌పై కాల్పులు జరిపిన విద్యార్థులు వీడియోలో బెదిరింపు
Students Shoot Teacher | ఇద్దరు విద్యార్థులు ఒక టీచర్‌పై తుపాకీతో కాల్పులు జరిపారు. (Students Shoot Teacher) తాము గ్యాంగ్‌స్టర్లమని పేర్కొన్న ఆ యువకులు ఆ టీచర్‌పై ఇంకా 39 సార్లు కాల్పులు జరుపుతామని వీడియోలో బెదిరించారు.
లక్నో: ఇద్దరు విద్యార్థులు ఒక టీచర్‌పై తుపాకీతో కాల్పులు జరిపారు. (Students Shoot Teacher) తాము గ్యాంగ్‌స్టర్లమని పేర్కొన్న ఆ యువకులు ఆ టీచర్‌పై ఇంకా 39 సార్లు కాల్పులు జరుపుతామని వీడియోలో బెదిరించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఖండౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలుపూర్‌లో సుమిత్ సింగ్ అనే వ్యక్తి ఒక కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. అతడి కోచింగ్ సెంటర్లో చదివిన ఇద్దరు విద్యార్థులు గురువారం ఆ టీచర్‌ను బయటకు పిలిచారు. వెంట తెచ్చిన గన్‌తో ఆయన కాలుపై కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. కాలికి బుల్లెట్ గాయమైన టీచర్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు టీచర్ కాలుపై కాల్పులు జరిపి పారిపోయిన విద్యార్థులు అనంతరం ఒక రీల్ చేశారు. తమను తాము గ్యాంగ్‌స్టర్స్‌గా అందులో పేర్కొన్నారు. ‘ఆరు నెలల తర్వాత తిరిగి వస్తా. ఆ టీచర్‌ను 40 సార్లు కాల్చుతా, ఇంకా 39 బుల్లెట్లు మిగిలి ఉన్నాయి’ అని ఒక విద్యార్థి అందులో పేర్కొన్నాడు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు యువకులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. టీచర్‌పై కాల్పులతోపాటు బెదిరింపు వీడియోపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
— POLICE COMMISSIONERATE AGRA (@agrapolice) October 5, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Make Video
- shoot
- students
- Teacher
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

