UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
UP polls : సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)తో కాంగ్రెస్ పార్టీ పొత్తు కోసం ప్రయత్నిస్తుంది. అయితే, తమకు 200 అసెంబ్లీ సీట్లు కావాలని ఎస్పీని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. యూపీలో మొత్తం 403 అసెంబ్లీ సీట్లున్నాయి.
UP polls : వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటినుంచే ప్రతిపక్షాలు పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నాయి. బలంగా ఉన్న అధికార పార్టీ బీజేపీని ఎదుర్కోవాలంటూ కూటమి కట్టడం తప్పదని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)తో కాంగ్రెస్ పార్టీ పొత్తు కోసం ప్రయత్నిస్తుంది. అయితే, తమకు 200 అసెంబ్లీ సీట్లు కావాలని ఎస్పీని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
యూపీలో మొత్తం 403 అసెంబ్లీ సీట్లున్నాయి. అందులో సగం సీట్లు కావాలని కాంగ్రెస్ అడుగుతోంది. ఈ విషయంపై ఇరు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి 50 సీట్లు మాత్రమే ఇచ్చేందుకు గతంలో ఎస్పీ అంగీకరించింది. ఆ సమయంలో 150 సీట్లు కావాలని కాంగ్రెస్ అడిగింది. కానీ, దీనికి ఎస్పీ నిరాకరించింది. 50 సీట్లు ఇవ్వడమే ఎక్కువ అన్నట్లు వ్యాఖ్యానించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ 50 సీట్లకు సర్దుకుంటుందేమో అనుకున్నారు అంతా. కానీ, విచిత్రంగా 200 సీట్లు డిమాండ్ చేస్తోంది. ఇటీవలే ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నేతలతో ఆ పార్టీ అగ్రనేత ప్రియాంకా గాంధీ మాట్లాడారు.
సీట్ల సర్దుబాటుపై నేతలతో చర్చించారు. 150 సీట్లపై చర్చిస్తారు అనుకుంటే.. ఏకంగా 200 సీట్లు కావాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై అధికారిక ప్రకటన లేదు. ఇక, కాంగ్రెస్ తాజా ప్రతిపాదనపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఆయన గతంలో తమ పార్టీ 350 సీట్లలో, కాంగ్రెస్ 53 సీట్లలో పోటీ చేస్తుందని తెలిపారు. యూపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అక్కడ బీజేపీ (ఆదిత్యనాథ్ యోగి) ఆధ్వర్యంలోని ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
యాసంగిలో ఆరుతడి పంటల సాగు మేలు : ఏడీఏ సరిత
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

