అక్రమ ఆయుధాల కేసులో దోషిగా యూపీ మంత్రి… తీర్పు తర్వాత కోర్టు నుంచి పరార్
లక్నో: ఉత్తర ప్రదేశ్‌కు చెందిన బీజేపీ మంత్రి రాకేష్ సచన్‌ను, అక్రమంగా ఆయుధం కలిగి ఉన్న కేసులో దోషిగా కోర్టు శనివారం నిర్ధారించింది. శిక్షలు ఖరారు చేయాల్సి ఉంది. అయితే ఈ తీర్పు వెలువడగానే కోర్టు నుంచి ఆయన పారిపోయారు. దీంతో మంత్రి రాకేష్ సచన్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో కాంగ్రెస్ నేత అయిన రాకేష్ సచన్ యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆయన మధ్య, చిన్న, సూక్ష్మ సంస్థలు, ఖాదీ శాఖల మంత్రిగా ఉన్నారు.
కాగా, రాకేష్ సచన్ అక్రమంగా ఆయుధం కలిగి ఉన్నట్లు 1991లో కేసు నమోదైంది. శనివారం ఈ కేసుపై కాన్పూర్ కోర్టు తీర్పు ఇచ్చింది. మంత్రి రాకేష్ సచన్‌ను దోషిగా నిర్ధారించింది. అయితే శిక్షలు ఖరారు చేయాల్సి ఉంది. నిందితులు దోషిగా తేలితే పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుంటారు. ఈ నేపథ్యంలో కేసు విచారణ నిమిత్తం కోర్టుకు వచ్చిన రాకేష్, తీర్పు అనంతరం అక్కడి నుంచి జారుకున్నారు.
మరోవైపు మంత్రి రాకేష్ తీరుపై ప్రతిపక్షాలు విమర్శించాయి. దోషిగా తేలిన ఆయన పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకునేందుకు కోర్టు నుంచి పారిపోయారని ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన స్పందించారు. తాను కోర్టు నుంచి పారిపోలేదని, కావాలంటే అక్కడి సీసీటీవీ ఫుటేజ్ చూడాలని అన్నారు. ఇతర కార్యక్రమాలు ఉండటంతో వాటికి హాజరయ్యానని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

