Meerut | భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణశిక్ష.. హత్య చేసి పాముకాటుగా నమ్మించిన భార్య
Meerut : భర్తను హత్య చేసిన భార్యకు, ఆమె ప్రియుడికి జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది. ఈ మేరకు శుక్రవారం మీరట్ జిల్లా కోర్టులో అడిషనల్ జడ్జి 12 అయిన జైవీర్ సింగ్ నగర్ శిక్ష ఖరారు చేశారు.
Meerut : భర్తను హత్య చేసిన భార్యకు, ఆమె ప్రియుడికి జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది. ఈ మేరకు శుక్రవారం మీరట్ జిల్లా కోర్టులో అడిషనల్ జడ్జి 12 అయిన జైవీర్ సింగ్ నగర్ శిక్ష ఖరారు చేశారు. ఉత్తర ప్రదేశ్, మీరట్లో ఈ తరహా శిక్ష ఖరారు కావడం రెండు రోజుల్లో ఇది రెండోది. మొదటి కేసులో కూడా భర్తను హత్య చేసినందుకు భార్య, ఆమె ప్రియుడికి మరణశిక్ష విధించింది మీరట్ జిల్లా కోర్టు. తాజా కేసులో మృతుడు అమిత్ కశ్యప్ కాగా.. అతడిని భార్య రవిత, ఆమె ప్రియుడు అమర్దీప్ కలిసి హత్య చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి. గత ఏడాది ఏప్రిల్ 17న అమిత్ కశ్యప్ను అతడి భార్య రవిత, ఆమె ప్రియుడు అమర్దీప్ కలిసి గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం అతడిని పాము కరవడం వల్లే చనిపోయాడని నమ్మించారు. ఈ విషయం అందరూ నమ్మేలా బెడ్ పక్కన ఒక పామును కూడా వదిలిపెట్టారు. అయితే, అతడు పాముకాటు వల్ల చావలేదని పోస్టుమార్టంలో తేలింది. అతడి ఒంటిపై పాము కాటు గాయాల్లేవని వైద్యులు అన్నారు. గొంతు నులమడం వల్లే అతడు మరణించాడని కూడా వైద్యులు ధృవీకరించారు.
దీంతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి విచారణ జరపగా.. రవిత, అమర్దీప్ వ్యవహారం బయటపడింది. వారే హత్య చేసినట్లుగా తేలింది. దీనిపై స్థానిక జిల్లా అడిషన్ కోర్టు-12లో విచారణ జరిగింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు 60 రోజుల్లోనే చార్జిషీటు దాఖలు చేశారు. ఇంతకాలం కోర్టులో విచారణ జరగగా.. పలువురు సాక్షులను విచారించి, ఇద్దరూ హత్యకు పాల్పడ్డట్లు గుర్తించారు. దీనిపై శుక్రవారం కోర్టు తీర్పు వెల్లడించింది. నిందితులు ఇద్దరూ వేర్వేరు జైళ్ల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జడ్జి వారి నేరం, శిక్ష గురించి ప్రశ్నించారు. తాము చేసిన పనికి పశ్చాత్తాప పడుతున్నామని చెప్పారు. కోర్టు ఏ శిక్ష వేసినా చట్టపరంగా అనుభవించడానికి తాను సిద్ధమేనని రవిత తెలిపింది. తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, వారి బాధ్యతను ఇతరులు చూసుకుంటారని కోర్టుకు తెలిపింది. అమర్దీప్ మాత్రం తనకు వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారని, వారి సంక్షేమం చూసుకునే విషయంలో ఇబ్బంది రాకుండా చూడాలని విజ్ఞప్తి చేశాడు.
అనంతరం ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం వారికి మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. రెండు రోజుల క్రితమే మీరట్, బ్లూ డ్రమ్ మర్డర్ కేసులో నిందితులు రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాకు కూడా మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Meerut | భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణశిక్ష.. హత్య చేసి పాముకాటుగా నమ్మించిన భార్య
School Shooting: అమెరికా స్కూల్లో కాల్పుల ఘటన.. ముగ్గురు చిన్నారులు మృతి
Tragedy | సత్యసాయి జిల్లాలో విషాదం.. రిజర్వాయర్లో ప్రమాదవశాత్తు పడి ఐదుగురు బాలికలు మృతి
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
Warangal | వరంగల్ డిఐజి ఆఫీస్లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

