Man Tries To Kill Doctor | జూనియర్ డాక్టర్‌తో చనువుగా ప్రియురాలు.. కాల్పులు జరిపి చంపేందుకు వ్యక్తి యత్నం
Man Tries To Kill Doctor | తన ప్రియురాలు జూనియర్ డాక్టర్‌తో స్నేహంగా ఉండటంపై ఒక వ్యక్తి ఆగ్రహించాడు. ఆమె చనువుగా ఉంటున్న ఆ డాక్టర్‌పై కాల్పులు జరిపి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. అయితే గురి తప్పడంతో ఆ జూనియర్ డాక్టర్ బతికిపోయాడు.
చెన్నై: తన ప్రియురాలు జూనియర్ డాక్టర్‌తో స్నేహంగా ఉండటంపై ఒక వ్యక్తి ఆగ్రహించాడు. ఆమె చనువుగా ఉంటున్న ఆ డాక్టర్‌పై కాల్పులు జరిపి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. అయితే గురి తప్పడంతో ఆ జూనియర్ డాక్టర్ బతికిపోయాడు. (Man Tries To Kill Doctor) తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగింది. 26 ఏళ్ల రోహన్, మద్రాస్ మెడికల్ కాలేజీలో పీజీ వైద్య విద్యార్థి. రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం టీ తాగేందుకు క్యాంపస్ సమీపంలోని టీస్టాల్కు వెళ్లాడు.
కాగా, రోహన్‌ను ఇద్దరు వ్యక్తులు అనుసరించారు. వారిలో ఒకరు గన్‌తో అతడిపైకి కాల్పులు జరిపాడు. అయితే గురి తప్పడంతో రోహన్‌కు ఏమీ కాలేదు. కాల్పులను గమనించిన స్థానికులు ఒకర్ని పట్టుకోగా మరో వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు పట్టుకున్న రితిక్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం ద్వారా హత్యకు కుట్ర పన్నిన అమిత్ కుమార్‌ను అరెస్ట్ చేశారు.
మరోవైపు నిందితులిద్దరూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తులని పోలీసులు తెలిపారు. ప్రియురాలైన పీజీ మెడికల్ విద్యార్థిని తనతో మాట్లాడకపోవడంపై అమిత్ కుమార్ ఆగ్రహించినట్లు చెప్పారు. రోహన్‌తో ఆమె స్నేహంగా ఉండటంతో అనుమానించి అతడ్ని హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు వెల్లడించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

